రుద్రమదేవి సీరియల్ లో సోమాంబ దేవిగా నటిస్తున్న హీరోయిన్ ని గుర్తు పట్టారా…?
Rudramadevi serial Somamba Devi :స్టార్ మా ఛానల్ లో గత జనవరి నుంచి ప్రసారమవుతున్న రుద్రమదేవి సీరియల్ లో ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది. సాటిలేని మహారాజు ట్యాగ్ లైన్ తో ప్రతిరోజూ రాత్రి 9గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో రుద్రమదేవి తల్లి సోమాంబ దేవిగా నటిస్తున్న నటి చాలా మూవీస్ లో చేసింది. ఈమె పూర్తిపేరు రాతి ఆర్ముగం.
బెంగుళూరులో 1992లో సెప్టెంబర్ 23న రాతి జన్మించింది. పుట్టింది కన్నడలో అయినా వాళ్ళ పేరెంట్స్ తమిళియన్స్. అందుకే ఆర్ముగం పేరొచ్చింది. ఆమెకు ఓ సిస్టర్, ఓ బ్రదర్ ఉన్నారు. బెంగుళూరులోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. క్లాసికల్ డాన్స్ లలో కూడా ఆరితేరింది. పలు షోస్ చేసింది.
తమిళ సినిమాతో మూవీ కెరీర్ స్టార్ట్ చేసిన రాతి చాలా తమిళ సినిమాలు చేసి, మంచి పాపులార్టీ తెచ్చుకుంది. పల్లకిలో పెళ్లికూతురు మూవీతో తెలుగు వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన రాతి ఆతర్వాత అల్లరి బుల్లోడు, అయోధ్య, మొగుడ్స్ పెళ్లామ్స్ , అసాధ్యుడు, సంక్రాంతి, వంటి సినిమాల్లో చేసి, బుల్లితెర మీద కూడా ఎన్నో సీరియల్స్ చేసింది. ఏడేళ్ల తర్వాత రుద్రమదేవి సీరియల్ వంటి పెద్ద ప్రాజెక్ట్ లో చేస్తోంది.