వకీల్ సాబ్ హీరోయిన్ అనన్య నాగేళ్ల గురించి ఈ విషయాలు తెలుసా?
Vakeel Sab Movie Heroine Ananya Nagella :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చేరాక అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు వచ్చిన వకీల్ సాబ్ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. పింక్ రీమేక్ గా వచ్చిన ఈ మూవీని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా, నివేదితా థామస్, అంజలి కీలక పాత్రలు వేశారు. వీరిద్దరి తో పాటు అనన్య నాగెళ్ల కూడా నటించింది. ఇంతకీ ఈమె ఎవరంటే,పద్మశ్రీ చింతపల్లి మల్లేశం తెరకెక్కించిన మల్లేశం మూవీలో అనన్య నటించింది.
మల్లేశం మూవీలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అనన్య ఇప్పుడు వకీల్ సాబ్ మూవీలో నటించింది. 1996ఆగస్టులో ఖమ్మంలోని సత్తుపల్లిలో పుట్టిన ఈమె ఫాథర్ వ్యవసాయదారుడు. అనన్యకు ఓ బ్రదర్ ఉన్నాడు. హైద్రాబాద్ రాజమహేంద్ర కాలేజీలో బిటెక్ పూర్తిచేసింది. ఎల్ ఎల్ బి కూడా చేసి, ఐటి సెక్టార్ లో ఓ ఏడాది జాబ్ చేసింది. అనుకోకుండా షార్ట్ ఫిలిం లోకి యాక్టింగ్ లోకి అడుగుపెట్టింది. సైమా అవార్డు కూడా వచ్చింది.
ఇంకా యాక్టింగ్ నేర్చుకోవాలని మణికొండలో యాక్టింగ్ సంస్థలో చేరిన అనన్య ఓ పక్క యాక్టింగ్ చేస్తూనే మెరిస్తే మేరుపల్లె కవర్ సాంగ్ లో చేసింది. మల్లేశం మూవీ ఆడిషన్స్ కోసం వెళ్లి సెలక్ట్ అయింది. వైఫ్ రోల్ లో బాగా ఆకట్టుకున్న అనన్య ఆతర్వాత ప్లే బ్యాక్ మూవీలో చేసినా సక్సెస్ కాలేదు. అనుకొకుండా వకీల్ సాబ్ లో సెలెక్ట్ అయ్యి తన నటనతో అలరించింది.