MoviesTollywood news in telugu

సుత్తివేలు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారో తెలుసా?

Suthivelu Family :ఒడిడుకులు అనేవి అందరి జీవితాల్లో సహజం. అందులో తెలుగు ఇండస్ట్రీలో మరీను. కొందరు అయితే ఇక అయి పోయిందిలే అనుకునే సమయంలో ఒక్కసారిగా ఫార్మ్ లోకి వచ్చేస్తారు. కొందరు మాత్రం కోలుకోలేని దెబ్బ తింటారు. ఏది ఏమైనా తట్టుకుని నిలబడ్డం ముఖ్యం. కానీ ఒకప్పుడు బాగా బతికి , ఇప్పుడు చితికిపోయారనే మాట ఇండస్ట్రీలో చాలామంది విషయంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక జంధ్యాల ఎంకరేజ్ మెంట్ తో హాస్య నటుడిగా రాణించిన సుత్తివేలు జీవితంలో ఒడిడుకులు ఎలా ఉన్నాయో చూద్దాం.

హాస్య నటుడిగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సుత్తివేలు తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. సీరియల్ పాత్రల్లో సైతం రాణించారు. సుత్తివేలు తండ్రి శేష సత్యనారాయణ శర్మ, తాతయ్య పేరు లక్ష్మి నరసింహారావు. తాతయ్య పేరే సుత్తివేలుకి పెట్టారు. తాతగారికి ఆస్తులుండేవి. ఎలాంటి బాధ లేకుండా హాయిగా ఉండేవారు. మంచితనమే,సాయం చేసే గుణమో మొత్తానికి ఆస్తులు కరిగిపోతూ వచ్చాయి. తండ్రి హయాంలో కూడా బాగానే ఉండేదట. టీచర్ గా ఉద్యోగం సంపాదిస్తే, ఆరు నెలలకు ఒకేసారి జీతాలు రావడం,ఇంట్లో అనారోగ్యాలు వంటి వాటివలన సత్యనారాయణ శర్మ బతికి చెడ్డాడనే పేరు తెచ్చుకున్నారు.

తండ్రి దానగుణం వలన కూడా మరిన్ని ఆస్తులు కరిగి, కొద్దిపాటి ఆస్తులే మిగలడంతో కొన్నాళ్ళు సుత్తివేలు సజావుగానే జీవించారు. తండ్రిలాగానే నాటకరంగం మీద మక్కువతో ఆంధ్ర,తమిళనాడులలో నాటకాలు వేస్తూ బిజీగా గడిపారు. రెమ్యునరేషన్ విషయంలో రాజీపడకుండా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు. నాలుగు స్తంభాలాట మూవీతో ఎంట్రీ ఇచ్చి, ఖైదీ, రెండు జెళ్ళ సీత, ఇలా పలు చిత్రాల్లో దశాబ్దకాలం పాటు ఇండస్ట్రీని దున్నేసాడు. పక్కా ప్లాన్ చేసుకోవడం వలన ఉన్నన్నాళ్ళు హాయిగా కాలం గడిపారు. సరదాగా నవ్విస్తూ నవ్వుతూ జీవించారు