80 ఏళ్ళు పైబడిన ఈ స్టార్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో …?
80+ Aged Tollywood Stars: బహుముఖ ప్రజ్ఞాశీలి, కళాత్మక చిత్రాల దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాధ్ వయస్సు 91సంవత్సరాలు. శంకరాభరణం లాంటి ఎన్నో సినిమాలను వెండితెరకు అందించిన విశ్వనాధ్ నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆరోగ్యంగా ఇంటివద్దే ఉంటున్నారు.ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉంటూ, సినిమాలు కూడా నిర్మించిన మన్నవ బాలయ్య వయసు 91సంవత్సరాలు. ఇంటివద్దే ఉంటూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎక్కడైనా తప్పనిసరి అకేషన్ ఉంటె హాజరవుతున్నారు. నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ వయస్సు 86సంవత్సరాలు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకూ సినిమా ఇండస్ట్రీతో విడదీయని అనుబంధం ఉంది. సినిమాల్లో ఇప్పుడు పెద్దగా కనిపించకపోయినా,ఆరోగ్యంగా ఇంటివద్దే ఉంటూ ముఖ్యమైన పనులుంటే బయటకు వస్తున్నారు. సింగర్ సుశీల వయస్సు 86సంవత్సరాలు.యాక్టివ్ గా ఉన్నారు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్త, ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు తీసిన రామోజీరావు 85ఏళ్ళ వయస్సులో కూడా ఈటివి ఫంక్షన్స్, సినిమా ఫంక్షన్స్ కి వస్తున్నారు. సీనియర్ నటి జమున వయసు 85సంవత్సరాలు. ఇప్పటికీ హుషారుగా ఉంటూ డాన్స్ లు వేస్తుంటారు. సీనియర్ నటి కాకరాల సత్యనారాయణ 85ఏళ్ళ వయసులో కూడా అప్పుడప్పుడూ పలకరిస్తు న్నారు.
మరో సీనియర్ నటి,ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న బి సరోజాదేవి వయస్సు 84సంవత్సరాలు. 1990వరకూ సినిమాల్లో చేసి,భర్త మరణంతో స్వచ్ఛంద సంస్థలతో కాలం గడుపుతున్నారు. సింగర్ జానకి వయస్సు 83సంవత్సరాలు. యాక్టివ్ గా ఉన్నారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు వయస్సు 82సంవత్సరాలు. యాక్టింగ్ లోనే కాదు, పాలిటిక్స్ లో కూడా చురుగ్గా ఉన్నారు. మొన్నటి వరకూ సినిమాల్లో నటించిన గిరిబాబు వయస్సు 82సంవత్సరాలు. ప్రస్తుతం రిలాక్స్డ్ గా ఉన్నారు.
సీనియర్ నటి కాంచన వయస్సు 82సంవత్సరాలు. ఆరోగ్యంగా ఇంటివద్దే ఉంటున్నారు. నటుడు మురళీమోహన్ వయస్సు 81సంవత్సరాలు. సినిమాల్లో చేస్తూనే ఉన్నారు. రాజబాబు తమ్ముడు చిట్టిబాబు తనదైన మేనరిజంతో ఇండస్ట్రీలో అలరించి,ఇంకా ఛాన్స్ వస్తే చేస్తున్నారు. ఈయన వయస్సు 80సంవత్సరాలు.