జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ ఎన్ని సినిమాల్లో నటించాడో…?
Janaki kalaganaledu Serial Hero Amardeep :సిల్వర్ స్క్రీన్ కి ఏమాత్రం తీసిపోని రీతిలో బుల్లితెర నటులకు గుర్తింపు లభిస్తోంది. అందునా సీరియల్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే అన్ని చానల్స్ లో సీరియల్స్ పోటాపోటీగా నడుస్తున్నాయి. స్టార్ మాలో ప్రసారం కానున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు సీరియల్ హిందీలో పాపులర్ అయిన సీరియల్ కి రీమేక్ గా వస్తోంది. ఇందులో నటించే హీరో అమర్ దీప్ చౌదరి 1990లో అనంతపురంలో జన్మించాడు.
చిన్నప్పటి నుంచి అమర్ కి యాక్టింగ్ అంటే ఇష్టం. ఆమె తల్లి జానపద నృత్యం వచ్చు. దాంతో డాన్స్ పట్ల అమర్ కి ఇష్టం ఏర్పడింది. అనంతపురంలో స్కూల్,కాలేజీ పూర్తిచేసి,బిటెక్ అయ్యాక,యూకేలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన అమర్ ఓ ఏడాది సాఫ్ట్ వేర్ ఎడ్వైజర్ గా చేసాడు. ఎన్నో డాన్స్ షోస్ లో పాల్గొన్న అమర్ డాన్స్ బేబీ డాన్స్ లో కూడా పాల్గొన్నాడు.
2016లో షార్ట్ ఫిలింతో కెరీర్ స్టార్ట్ చేసిన అమర్ ఆతర్వాత సూపర్ మెచ్చి, రాజధాని లవ్ స్టోరీ వంటి ఎన్నో వెబ్ సిరీస్ లో చేసాడు. ఉయ్యాలా జంపాల సీరియల్ తో తెలుగు టివి ఆడియన్స్ కి పరిచయమైన అమర్ సెకండ్ హీరోగా చేసాడు. సిరిసిరి మువ్వలు సీరియల్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, శైలజారెడ్డి అల్లుడు వంటి సినిమాల్లో చేసాడు. అలాగే సారధి, ఎవరు వంటి మూవీస్ లో చేసాడు.