సినిమాలు వదిలేసి సీరియల్స్ లో నటిస్తున్ననటులు…ఎవరో…?
Janaki Kalaganaledu Serial Raasi :సినిమా రంగానికి ఎంతటి పేరుందో, టివి రంగానికి కూడా అంతే క్రేజ్ ఉంది. పైగా టివిలో నిత్యం కనిపించడం వలన ఆడియన్స్ కి మరింత దగ్గరగా కనిపిస్తున్నారు. అందుకే చాలామంది వెండితెరనుంచి బుల్లితెరకు షిఫ్ట్ అవుతున్నారు. శంకరాభరణం సినిమాతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న మంజు భార్గవి ఆతర్వాత కొన్ని సినిమాలు చేసారు.
అలీతో కల్సి యమలీల సినిమాలో తల్లి పాత్ర పోషించిన మంజుభార్గవి ప్రస్తుతం యమలీల సీరియల్ లో బుల్లితెర మీద తన నటనతో అలరిస్తున్నారు. పలు సినిమాల్లో చేసిన కస్తూరి కూడా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తోంది. అరవింద సమేత సీరియల్ లో నటి సన నటిస్తోంది. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో బెంగుళూరు పద్మ నటిస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించి, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన నటనతో అలరిస్తున్న రమ్యకృష్ణ బుల్లితెరమీద నాగభైరవి సీరియల్ లో చేస్తోంది. ఒకప్పటి బాలనటి, స్టార్ హీరోయిన్ రాశి కూడా జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తోంది. నటి జయలలిత ప్రేమ ఎంత మధురం సీరియల్ లో చేస్తోంది. నటి భావన ప్రస్తుతం కల్యాణ వైభోగం, యమలీల సీరియల్స్ లో చేస్తోంది.