నవీన్ పొలిశెట్టి షాకింగ్ పారితోషికం…వైరల్ అవుతున్న వార్త
Telugu Actor Naveen Polishetty :సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఎన్నో పడిగాపులు కాయాలి. ఎందరి చుట్టూనో,ఎన్నోసార్లు ప్రదక్షిణాలు చేయాలి. తీరా చోటు దక్కాక టాలెంట్ ఉండాలి. అదే సరిపోదు అదృష్టం కూడా తప్పనిసరి. టాలెంట్ కి అదృష్టం తోడైతే నిలదొక్కుకోగలరు. లేకుంటే కనుమరుగైపోతారు. అయితే అదృష్టం ఉన్నవాళ్లు ఛాన్స్ లతో దూసుకెళ్తారు. అలాంటి అదృష్టం వరించినవాళ్లలో నవీన్ పొలిశెట్టిని కూడా చెప్పుకోవాలి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు.
థియేటర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మొదలు పెట్టి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన నవీన్ పొలిశెట్టి ఇటీవల జాతిరత్నాలు సినిమాతో మంచి ఫార్మ్ లోకి వచ్చాడు. తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తను తర్వాత చేసే సినిమాకు భారీగా రెమ్యునరేషన్ పెంచేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఓ నిర్మాత నవీన్ పొలిశెట్టికి 5కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చాడట. నిజానికి జాతిరత్నాలు ఓ చిన్న సినిమాగా విడుదలై రికార్డు కలెక్షన్స్ తో దూసుకపోతోంది. ఈ సినిమా ఎంతలా విజయం సాధించినదంటే ఆ సినిమాతో పాటుగా రిలీజ్ అయిన సినిమాలు దెబ్బతినడంతో వాటిని తొలగించి, ఆ థియేటర్ లో కూడా జాతిరత్నాలు సినిమా రిలీజ్ చేసిన ఘటనలు ఉండడం గ్రేట్. అందుకే నవీన్ పోలిశెట్టికి డిమాండ్ పెరిగింది.