MoviesTollywood news in telugu

హీరోయిన్ ధన్య రెమ్యునరేషన్ రేంజ్ ఎంతో తెలిస్తే…

Telugu heroine dhanya balakrishna :సినిమా ఇండస్ట్రీ అందరికీ పూలమాన్పు కాదు. ఛాన్స్ రావాలి, టాలెంట్ ఉండాలి, అదృష్టం కూడా కల్సి రావాలి లేకుంటే, ఎంత కష్టపడ్డా ఫలితం కానరాదు. హీరోయిన్ ధన్య బాలకృష్ణ మొదట్లో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా నటించింది. అయితే రాజు గారి గది మూవీతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ అమ్మడి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గుర్తింపు రాలేదు. అయినా సరే, తనపట్టు విడవకుండా సినిమా హీరోయిన్ గా ఛాన్స్ లు తెచ్చుకుని ప్రస్తుతం బానే రాణిస్తోంది.

ఇక బుల్లితెర పవర్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీలో హీరోయిన్ గా చేసింది. ఈచిత్రం ఓ మోస్తరుగా ఆడింది. అలాగే గతేడాది అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి మూవీలో మెయిన్ లీడ్ పాత్రలో నటించినా తగిన గుర్తింపు రాలేదు. ప్రస్తుతం కన్నడంలో ఫ్లిప్ ఫ్లాప్ అనే మూవీలో ధన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న 20 20 మూవీలో హీరోయిన్ గా నటించేందుకు ఒకే చెప్పిందట.

ధన్య చిన్న బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూ, దాదాపు 15 నుంచి 25 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. నేను సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో కూడా నటించా. అందుకు తనకు రోజుకి 4 వేల రూపాయలు పారితోషకం ఇచ్చేవారు. కానీ తను ఏమాత్రం నిరాశ చెందకుండా శ్రమించి ప్రస్తుతం లక్షల రూపాయలు పారితోషికం తీసుకునే స్టేజ్ కి వచ్చా. అయితే చాలా కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ కూడా ఛాన్స్ కోసం అడ్డదారుల్లో ప్రయత్నించలేదు అని యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ధన్య వివరించింది.