ఎన్‌టిఆర్ హీరోయిన్ గురించి ఎవరికి తెలీని నమ్మలేని నిజాలు
Tollywood heroine sameera reddy :అభినయం, గ్లామర్ మేళవించి కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ సినిమాల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న సమీరా రెడ్డి అనగానే హిట్ మూవీస్ గుర్తొస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ తో కల్సి నటించిన నరసింహుడు, అశోక్ మూవీస్ అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన చేసిన జై చిరంజీవ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లాక్ డౌన్ సమయంలో పలు ఫోటోలను షేర్ చేసింది.
సమీరా రెడ్డి 2014 లో ప్రముఖ బిజినెస్ మేన్ అక్షయ్ వర్ధేనిని ప్రేమించి పెళ్ళాడి, సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇంతకీ సమీరా భర్త అక్షయ్ ఒక మోటార్ సైకిల్ షోరూమ్స్ కు ఓనర్. బైక్స్ ను అమితంగా ఇష్టపడే సమీరా రెడ్డి పెళ్లికి ముందు భర్తతో కలిసి చాలాసార్లు రైడింగ్ కు వెళ్లారు. అంతెందుకు పెళ్లికి అక్షయ్ బైక్ పైనే వచ్చారు. 2014 జనవరి నెల 21వ తేదీన సమీరా,అక్షయ్ ల పెళ్లయింది.
సమీరా అక్షయ్ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. సమీరారెడ్డి సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటూ తరచూ ఫాన్స్ కి కనువిందు చేస్తోంది. ఈమెకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ముఖ్యంగా సామాజిక బాధ్యతతో ఈమె అనాథ పిల్లల కోసం ఓ సంస్థను నిర్వహిస్తోంది.