MoviesTollywood news in telugu

జాతి రత్నాలు హీరోయిన్ గురించి ఈ నమ్మలేని నిజాలు మీకోసమే

jathiratnalu heroine fariya abdullah :నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో నటించిన జాతిరత్నాలు మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఇందులో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా ఈ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసి,టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అఖిల్ అక్కినేని తో కల్సి ఓ సినిమా చేయబోతోంది. అయితే ఈమె ఎవరో కాదు హైదరాబాదీ అమ్మాయే. 1998మే 28న సంజయ్ అబ్దుల్లా, కౌశ సుల్తాన్ దంపతులకు జన్మించిన ఈమె కు ఓ సిస్టర్ ఉంది. సికింద్రాబాద్ లోని కాలేజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసింది. చిన్ననాటి నుంచి డాన్స్ అంటే ఇష్టం.

చిన్నతనంలోనే ఎన్నో డాన్స్ షోస్ లో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా ప్రత్యేకంగా డాన్స్ కూడా నేర్చుకుంది. మంచి పెయింటర్ కూడా అయిన ఈమెకు యాక్టింగ్ మీద కూడా ఆసక్తి ఉంది. పలు మీడియా సంస్థల్లో పనిచేసిన ఈమె పలు వెబ్ సిరీస్ లో నటించింది. హైదరాబాద్ వీడియోస్ పేరిట గల యూట్యూబ్ ఛానల్ లో చాలా వీడియోస్ లో యాక్ట్ చేసింది.

గత ఐదేళ్లుగా థియేటర్స్, వెబ్ సిరీస్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఫారియా కు సరైన గుర్తింపు తీసుకు రాలేదు. కేవలం యూట్యూబ్ వరకే పరిమితమైంది. నాగ అశ్విన్ ఓ ఫంక్షన్ కి వచ్చినపుడు తన వెబ్ సిరీస్ గురించి ఫరియా అబ్దుల్లా చెప్పింది. ఇక జాతి రత్నాలు మూవీ హీరోయిన్ కోసం వెతుకుతుంటే అనుదీప్ కి నాగ అశ్విన్ ద్వారా ఫరియా అబ్దుల్లా గురించి తెలిసి,ఆడిషన్స్ కి రావడం,సెలెక్ట్ కావడం,యాక్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.