కృష్ణ తులసి సీరియల్ హీరో అఖిల్ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?
Krishna Tulasi Serial Hero Akhil Babu :కృష్ణ తులసి సీరియల్ హీరో అఖిల్ బాబు అక్టోబర్ 16న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించాడు. ఆరడుగుల పొడుగు ఉండే ఇతడి అసలు పేరు దిలీప్ శెట్టి. దిలీప్ ని అఖిల్ అని కూడా పిలుస్తారు. మంగుళూరులోనే స్టడీస్ పూర్తిచేసాడు. ఎక్కువగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు చూసేవాడు. తాను కూడా యాక్టర్ కావాలని అనుకునే వాడు. స్టడీస్ పూర్తయ్యాక ఎన్ ఎం సి. హెల్త్ కేర్ లో ఎక్కౌంటెంట్ గా చేరాడు.
అయితే కాలేజీ డేస్ లోనే మోడలింగ్ లో చేరిన దిలీప్ 2015లో మిస్టర్ దుబాయి పోటీల్లో పాల్గొని ఫైనల్ రౌండ్ లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచాడు. ఇంకా పెళ్లి కాని దిలీప్ కి డాన్స్,యాక్టింగ్ అంటే ఇష్టం. కన్నడలో విద్యా వినాయక సీరియల్ లో నటించాడు. నాగభైరవి సీరియల్ హీరోయిన్ యాష్మి గౌడ కూడా విద్యావినాయక లో నటించింది. కస్తూరి నివాస్ అనే సీరియల్ లో హీరోగా నటించాడు. దాంతో మంచి ఫాలోయింగ్ వచ్చింది.
ప్రేమ ఎంత మధురం సీరియల్ లో హీరోయిన్ గా నటించిన అను కూడా కస్తూరి నివాస్ సీరియల్ లో చేసింది. పలు డాన్స్ షోస్ లో కూడా దిలీప్ పాల్గొన్నాడు. స్వర్ణ ఖడ్గం సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణ తులసి సీరియల్ లో హీరోగా తన నటనతో ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. కన్నడలో రోబోట్ అనే మూవీలో కూడా నటించాడు. ఇతడికి ఖరీదైన కార్లు, ఇల్లు ఉన్నాయి.సంపాదన కూడా బాగానే ఉంది.