MoviesTollywood news in telugu

సునీల్ హీరోయిన్ బిజినెస్ లో ఎన్ని లక్షలు పోగొట్టుకుందో తెలుసా?

Telugu actress nikki galrani :కన్నడ భామ సంజనా గల్రానీ చెల్లిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిక్కీ గల్రానీ తెలుగులో సునీల్ హీరోగా చేసిన కృష్ణాష్టమి మూవీలో హీరోయిన్ గా చేసింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా మంచి ఛాన్స్ లతో దూసుకెళ్తోంది. దాంతో అక్క కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కన్నడంలో హిట్స్ అందుకుంటూ, ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. తమిళ్ లో ఆది పినిశెట్టి సరసన మలుపు, మరకతమణి సినిమాలలో నటించింది. ఇప్పుడు ఆదితోనే మరో సినిమా చేస్తోంది.

తాజాగా నిక్కీ బెంగుళూరు పోలీస్ స్టేషన్ లో తనని ఓ వ్యక్తి చీటింగ్ చేసి 50 లక్షలు దోచేసాడని ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిఖిల్ అనే వ్యక్తి ఓ హోటల్ ను ప్రారంభించగా అతనితో కలిసి హోటల్ బిజినెస్ లోకి అడుగుపెడదామని నిక్కీ కూడా 50 లక్షల వరకూ పెట్టుబడిగా పెట్టింది. ఇందుకు గాను నెలకు 1 లక్ష ఇస్తానని నిఖిల్ హామీ ఇచ్చాడు.

అయితే పెట్టుబడి పెట్టి ఎంతకాలమైనా అతను ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకుని, పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఓపక్క తమిళ్ లో నిక్కీకి భాగానే ఛాన్స్ లు రావడం, మరో వైపు హీరో ఆది పినిశెట్టితో నిక్కీ ప్రేమలో ఉందని, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ పుకార్లపై క్లారిటీ మాత్రం లేదు.