విరాట్ కోహ్లీ, అనుష్క జంట ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాలసిందే
virat kohli and anushka sharma :భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాక జంట నివశిస్తున్న ఇంటి గురించి తాజాగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. నటిగా అనుష్క శర్మ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటే క్రికెటర్ గా విరాట్ కోహ్లీ కూడా సక్సెస్ అయ్యారు. ఈ జంట నివసించే ఇంటి విలువ దాదాపు 34 కోట్ల రూపాయలని, విస్తీర్ణం 7వేల చ. అ. ల కంటే ఎక్కువని టాక్.
అనుష్క శర్మ ప్రొడక్షన్ హౌస్ కోసం కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేయగా, దాని విలువ నాలుగున్నర కోట్ల రూపాయలని టాక్. ముంబైలో అనుష్క శర్మకు 10 కోట్ల రూపాయల విలువగల మూడు ప్లాట్లు ఉన్నాయని టాక్. ఈ జంటకు విలాసవంత మైన ఇళ్లతో పాటు లగ్జరీ కార్లు, ఖరీదైన కార్యాలయాలు ఉన్నాయి. ఈ జంట ఆస్తుల విలువ దాదాపు 1,000 కోట్ల రూపాయలని టాక్. ఈ జంట ఆస్తుల విలువ తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.
అనుష్క శర్మకు సొంతంగా నుష్ అనే ఫ్యాషన్ లేబుల్ ఉంది. ఈ బ్రాండ్ విలువ ఏకంగా 65 కోట్ల రూపాయలని టాక్. విరాట్ కోహ్లీ దగ్గర ఆడీ కార్లు ఉండగా ఒక్కో ఆడీ కారు విలువ 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువట. అలాగే కోహ్లీ దగ్గర 69 లక్షల రూపాయల విలువ చేసే గడియారం ఉంది. దీన్ని దాదాపు 56 వజ్రాలను అలంకరించి తయారు చేశారట. ఈ జంటకు గురుగ్రామ్ ప్రాంతంలో 80 కోట్ల కంటే ఎక్కువ విలువైన విలాసవంతమైన బంగ్లా, ఖరీదైన ఆస్తులు ఉన్నాయని టాక్.