MoviesTollywood news in telugu

మిఠాయి కొట్టు చిట్టెమ్మ సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?

Mithai kottu chittemma serial Heroine :మిఠాయి కొట్టు చిట్టెమ్మ సీరియల్ హీరోయిన్ చిట్టెమ్మ అసలు పేరు నక్షత్ర శ్రీనివాస్. 1992మే 16న శ్రీనివాస్, రాధ దంపతులకు జన్మించిన ఈమెకు ఇప్పుడు 29ఏళ్ళు. ఈమెకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. సుభాష్ చంద్ర బోస్ స్కూల్, సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజీలో చదువుకుంది. ఈమెను అంజని సౌమ్య,పద్దు,చిట్టి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈమెకు ఇంకా పెళ్లి కాలేదు.

చిన్న నాటి నుంచి డాన్స్ అంటే మక్కువ గల ఈమె స్కూల్ డేస్ లో కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనేది. 2011లో స్టడీస్ పూర్తయ్యాక కన్నడలో కృష్ణకుమారి సీరియల్ లో చేసింది. కన్నడలో పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించిన నక్షత్ర తెలుగులో గోరంత దీపం సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. పద్మావతి పాత్రలో బాగా నటించి మెప్పించింది. తెలుగు రాకపోయినా నేర్చుకుని మరీ నటించింది.

తర్వాత పున్నాగ,బంగారు గాజులు సీరియల్స్ లో నక్షత్ర నటించింది. ప్రస్తుతం మిఠాయి కొట్టు చిట్టెమ్మ సీరియల్ లో చిట్టెమ్మగా నటిస్తోంది. 5అడుగుల 10అంగుళాల ఎత్తు, 60కిలోల బరువు గల ఈమె సాంప్రదాయ దుస్తులంటే ఇష్టపడుతుంది. తెలుగు,కన్నడ,ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం ఉంది. హైదరాబాద్ లో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. కారు కూడా ఉంది. సంపాదన కూడా బాగానే ఉన్నట్టు సమాచారం.