MoviesTollywood news in telugu

ఒకప్పటి క్లాస్ మెట్స్.. ఇప్పుడు స్టార్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసా..?

Tollywood classmates heros :ఎవరు ఏ రంగంలో స్థిరపడినా చిన్ననాటి మిత్రులు కలిసినపుడు వచ్చే ఆనందం వేరు. అందుకే ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పేరిట ఆయా పాఠశాలల్లో విద్యార్థులు భేటీ అవుతూ ఆనాటి మధురానుభూతులను పంచుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం చిన్ననాటి మిత్రులను కలుస్తున్నారు. అయితే చిన్నప్పుడు ఒకే పాఠశాలలో ఒకే బెంచీలో కూర్చున్న మిత్రులు ఇప్పుడు స్టార్ హీరోలుగా,వ్యాపారవేత్తలుగా వెలుగొందుతున్నారు.

అలాంటి వాళ్ళ లిస్టు తీసుకుంటే ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాహుబలిలో భల్లాల దేవుడిగా పాపులర్ అయిన రానా ఇద్దరూ చిన్నప్పటి మిత్రులే. వీరిద్దరూ చిన్నతనంలో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. నాచురల్ స్టార్ నాని,బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న మాచిరాజు ప్రదీప్ ఇద్దరూ కూడా చిన్నప్పటి స్నేహితులే. హైదరాబాదులోని ఓ పాఠశాలలో ఇద్దరూ కల్సి చదువుకున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు కూడా చిన్నప్పుడు ఒకే తరగతి గదిలో చదువుకున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని,విరాట్ కోహ్లీ భార్యలైన హీరోయిన్ అనుష్క శర్మ, సాక్షి ధోని లు కూడా చిన్నప్పుడు ఒకటే స్కూల్లో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం వ్యాపార రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఆనంద్ మహేంద్ర,ముఖేష్ అంబానీ కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు.