MoviesTollywood news in telugu

టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ ఎవరో తెలుసా?

Tollywood Number 1 Heroine :తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి తరంలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ ఉంటారు. పోటాపోటీ ఉంటుంది. ఇప్పటి తరతంలో హీరోయిన్స్ నంబర్ 1 హీరోయిన్ ఎవరనే దానికి ఫ్యాన్స్ నుంచి పూజా హెగ్డే,రష్మిక మందన్నా,సాయిపల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. వీరి మధ్య పోటాపోటీ ఉంది. వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటు న్నారు. రష్మిక మందన్నా గత ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తోన్న రష్మిక కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నా కథల విషయంలో,పాత్రల విషయంలో జాగ్రత్త పడుతోంది. పూజా హెగ్డే విషయానికి వస్తే, గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ, గత ఏడాది సంక్రాంతి కి అల వైకుంఠపురములో మూవీలతో హిట్స్ అందు కోగా, పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

వరుస విజయాలు సొంతం చేసుకుంటున్న పూజా హెగ్డే మరిన్ని విజయాలు అందుకుంటే, నంబర్ 1 హీరోయిన్ గా ఉంటుందని ఫ్యాన్స్ మాటగా వినిపిస్తోంది. సాయిపల్లవి చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉన్నా వరుసగా విజయాలు సొంతం చేసుకోలేక పోవడం ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ రష్మిక అని చాలామంది ఫ్యాన్స్ భావిస్తుండగా ,సినిమాలను బట్టి మారొచ్చు. ఇక ఉప్పెన మూవీతో హిట్ అందుకున్న కృతిశెట్టి ఇక మీదట నటించే సినిమాలు హిట్టైతే మాత్రమే ఆమె స్టార్ హీరోయిన్ల రేసులో నిలిచే అవకాశం ఉంది.