మనవూరి కథ సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
manavoori kadha Full Movie :నటరత్న ఎన్టీఆర్ తర్వాత రైతు పాత్రలో మెప్పించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకు దక్కుతుంది. ఉండమ్మా బొట్టు పెడతా,ఇల్లు ఇల్లాలు,కొత్తకాపురం,పాడిపంటలు ఇలా పలు సినిమాలు రైతు పాత్రలతోనే మెప్పించారు. సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. చీకటి వెలుగులు మూవీని కృష్ణతో నిర్మించిన రంజిత్ కుమార్ మళ్ళీ కృష్ణతోనే మనవూరి కథ తీశారు.
పాలగుమ్మి పద్మరాజు రాసిన, ఎపి సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన నల్లరేగడి నవల ఆధారంగా ఈ మూవీ నిర్మించారు. ఈ మూవీకి మొదట్లో నల్లరేగడి టైటిల్ అనుకున్నా, తర్వాత మనవూరి కథ అనే టైటిల్ పెట్టారు. కోనసీమ అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ మూవీ కృష్ణ, జయప్రద జంటగా వచ్చిన రెండో సినిమా ఇది. రోజారమణి కీలక పాత్ర పోషించారు.
మామ కూతురా నీతో మాటున్నది ,గోదావరికి ఏ ఒడ్డున నీరు ఒక్కటే కుర్రదానికి ఏ వైపున అందమొక్కటే పాటలు ఈ మూవీలో బాగా పాపులర్ అయ్యాయి. కాగా ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పునూనె పాటను అప్పలాచార్య రాయగా అల్లు రామలింగయ్య ,గిరిజారాణిపై చిత్రీకరించారు. పల్లవికి సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో అందించు అందించు హాయిగా అని మార్చారు.