మహేష్,పవన్ సినిమాలను రిజెక్ట్ చేసిన శోభన్ బాబు…ఎందుకో తెలుసా?
Sobhan Babu Rejected Pawan Kalyan Movie : సోగ్గాడు శోభన్ బాబు అనగానే అప్పటి తరంలో అందమైన నటుడు. ఆయన చేసిన సినిమాలు ఎక్కువగా మహిళా ఆడియన్స్ కి దగ్గర చేశాయి. విలక్షణ నటన ఆయన సొంతం. మార్కెట్ ఉండగానే సినిమాలకు దూరమవుతున్నట్లు ప్రకటించి ఊహించని షాక్ ఇచ్చారు.
హీరోగా ఉన్న సమయంలో సంపాదించిన సొమ్ముని భూములు కొనడంతో సినిమాలో ఏ హీరోకి లేని ఆస్తి శోభన్ బాబుకే ఉందని అంటారు. అందుకే ఆయన ఫ్యామిలీతో చెన్నైలోనే సెటిలయ్యారు. రిటర్మెంట్ ప్రకటించాక మాటకు కట్టుబడి ఎన్నిపాత్రలు వచ్చినా వదిలేసారు.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో సుస్వాగతం సినిమాకు మంచి పేరు వచ్చింది. అందులో పవన్ తో పాటు అతడి తండ్రిగా రఘువరన్ నటనకు కూడా మంచి స్పందన వచ్చింది. అయితే రఘువరన్ పాత్రకోసం శోభన్ బాబుకి ఛాన్స్ వచ్చినా వదిలేసారు. అంతేకాదు, అతడు సినిమాలో నాజర్ పాత్ర కోసం అడిగితె కాదన్నారట. అలా మహేష్ బాబుతో కల్సి నటించే ఛాన్స్ వదిలేసుకున్నారు.