ఈ తారలకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
Tv serial heroines In telugu :అందం, అభినయం తో పాటు కొంత అదృష్టం కల్సి వస్తే,వెండితెరమీద నైనా,బుల్లితెరమీదనైనా దూసుకుపోవచ్చు. ఇక అందమైన కళ్ళతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే బుల్లి తెర హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అందులో ముందుగా స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రతో మెప్పిస్తున్న ప్రేమీ విశ్వనాధ్ గురించి చెప్పాలి.
కోపాన్ని,నవ్వుని,హాస్యాన్ని,ఎమోషన్ ని కూడా కళ్ళతోనే పలికిస్తోంది. ఇక ప్రీతి నిగమ్ నెగెటివ్ రోల్స్ లో కనిపించి, తన కళ్ళతో ఆకట్టుకుంటోంది. చంద్రముఖి, పాపే మా జీవన జ్యోతి, దీపారాధన వంటి సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంటోంది. ఆమె కళ్ళే ఆమెకు ప్లస్ పాయింట్.
అలాగే జి తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే మిఠాయికొట్టు చిట్టెమ్మ సీరియల్ లో అంజన ఎంతో చక్కగా నటిస్తూ,చారెడేసి తనకళ్లలోనే భావాలు పలికిస్తోంది. ఇక జి తెలుగులో ప్రసారమయ్యే త్రినయని సీరియల్ లో యష్క పడుకొనే తన కళ్ళద్వారా నవరసాలు పలికిస్తోంది. ఈటీవీలో అభిషేకం,మాటీవీలో రాధామధు వంటి సీరియల్స్ లో విశాల నటించి మెప్పించింది.
ముఖ్యంగా తన విశాలమైన కళ్ళతో అందరినీ కట్టిపడేసింది. శ్రావణ సమీరాలు లో నటించిన నవీన, మనసుమమత , పద్మవ్యూహం వంటి సీరియల్స్ లో నటిస్తున్న అస్మిత కూడా తమ అందమైన కన్నులతో ఆకట్టుకున్నారు. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో మీరా పాత్ర చేస్తున్న అనుశ్రీ,నాపేరు మీనాక్షి సీరియల్ లో దీపగా నటిస్తున్న వీణా పొన్నప్పన్ కూడా తమ కళ్ళతో ఆకట్టుకుంటున్నారు.
స్టార్ మాలో వచ్చే గోరింటాకు సీరియల్ లో శ్రీవల్లీగా నటిస్తున్న కావ్యశ్రీ, అందులోనే ప్రసారమయ్యే నీవల్లే నీవల్లే సీరియల్ లో హీరోయిన్ మహీ గౌతమీ, తమ అందమైన కళ్ళతో కట్టిపడేస్తున్నారు.శిరీష వల్లభనేని చెల్లెలి కాపురం సీరియల్ లో నటిస్తూ తన చక్కని కళ్ళతో మరపిస్తోంది. ఈటివి అమ్మ సీరియల్ లో అవని పాత్ర పోషిస్తున్న స్వాతి శర్మ తన కళ్ళతోనే నటనను కనబరుస్తోంది.
నేను శైలజ, పౌర్ణమి,చెల్లెలి కాపురం వంటి సీరియల్స్ లో నటిస్తున్న జయహారిక ఓవైపు పాజిటివ్,మరోవైపు నెగెటివ్ రోల్స్ లో నటించి మెప్పిస్తోంది. హీరోయిన్ గా యాష్మి గౌడ నాగభైరవి సీరియల్ లో నటిస్తూ, అందమైన కళ్ళతో ఆడియన్స్ ని కట్టిపడేస్తోంది. హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో అమాయకంగా నటిస్తున్న ప్రియా బాలకుమారన్ అలరిస్తోంది. ఇదే సీరియల్ లో హిట్లర్ గారి ముగ్గురు కోడళ్లలో ఒకరిగా నటిస్తున్న జయ ధనుష్ తన కళ్ళతోనే మంత్రముగ్దుల్ని చేస్తోంది.