MoviesTollywood news in telugu

మెగా మేనల్లుడు చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?

Vaishnav Tej Movies List :సినిమాల్లోకి రాకుండా ఉద్యోగంలో స్థిరపడాలని భావించి, అనుకోకుండా బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఉప్పెన సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ ఇప్పుడు వరుస ఆఫర్లతో ముందుకెళ్తున్నాడు. ఉప్పెన మూవీ గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా, కరోనా లాక్ డౌన్ అనంతర పరిణామాల్లో జాప్యమై,చివరకు ఈ ఏడాదిలో రిలీజై సూపర్ హిట్ అవ్వడమే కాదు,కాసుల వర్షం కురిపించింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన వైష్ణవ్ తేజ్ 2వ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి అయ్యింది. నవల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఏ సమయంలో అయినా రిలీజ్ కావచ్చట.

ఇక ముచ్చటగా 3వ సినిమా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తమిళ అర్జున్ రెడ్డి దర్శకుడు గిరీషయ్య దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ కావడంతో ఈ ఏడాది చివరకు పూర్తి చేస్తారని టాక్. ఇదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించ బోతున్న రెండు సినిమా లకు వైష్ణవ్ తేజ్ ఒకే చెప్పాడట. దర్శకులు ఎవరనేది త్వరలో క్లారిటీ రానుంది. ఇక పవన్ కు సన్నిహితుడిగా పేరున్న రామ్ తాళ్లూరి బ్యానర్ లో కూడా వైష్ణవ్ తేజ్ సినిమా చేస్తున్నట్లు,దీనికి దర్శకుడు కూడా కన్ఫర్మ్ అయినట్లు టాక్.

ఇక లాక్ డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత విడుదలైన సినిమాల్లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాగా ఉప్పెన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విడుదల అయిన చిత్రాల్లో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. ఉప్పెన సక్సెస్ తో వైష్ణవ్ తేజ్ ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరోగా నిలిచాడు. ఉప్పెన సినిమా తర్వాత మొత్తం అయిదు సినిమాలకు కమిట్ కావడం నిజంగా గ్రేట్ అంటున్నారు.