MoviesTollywood news in telugu

పూరి జగన్నాద్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో…ఎన్ని కోట్ల అస్థి…?

Puri Jagannath Luxury Lifestyle :ఎన్నో సక్సెస్ లు,ఎన్నో వైఫల్యాలు ఉన్న డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎందరికో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం విజయదేవరకొండతో పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు. లైఫ్ లో వచ్చే ఒడిడుకులు అధిగమిస్తూ పోవాలని పూరి జీవితం చెబుతుంది. పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్ కొట్టి, టాప్ డైరెక్టర్ లిస్టులో నిలిచాడు. పేట్ల పూరీజగన్నాధ్ ఇతడి పూర్తి పేరు. జగన్ అని నిక్ నేమ్. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1966సెప్టెంబర్ 28న పుట్టిన పూరికి 55ఏళ్ళు నిండుతున్నాయి. పెద్ద పూడపల్లి సెయింట్ మేరీస్ స్కూల్ లో చదివి, అనకాపల్లి ఏ ఐ ఎం ఎల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు.

పూరి తండ్రి బిజినెస్ చేసేవారు. తల్లి గృహిణి. సాయరామ్ గణేష్, ఉమాశంకర్ గణేష్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. పూరి చేసే షూటింగ్స్ కి లావణ్య అనే అమ్మాయి రావడం, ఒకరికొకరు ప్రపోజ్ చేసి, ప్రేమించి 1996లో పెళ్లి చేసుకున్నారు. ఆకాష్ పూరి, పవిత్ర పూరి అనే ఇద్దరు పిల్లలున్నారు. పూరి తండ్రికి థియేటర్ ఉండడం, రోజుకి రెండు షోస్ వేయడం, కథలు చదివే అలవాటు ఉండడంతో సినిమాలపై ఆటోమేటిక్ గా పూరికి ఇంటరెస్ట్ వచ్చింది. ఎన్నో స్టోరీస్ రాసి తండ్రికి చూపించేవాడు. సినిమా డైరెక్టర్ కావాలని ఇంట్లో నుంచి 25వేలు తీసుకుని హైదరాబాద్ వచ్చాడు.

రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేరిన పూరి తొలిసారిగా డైరెక్టర్ గా మారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి మూవీ తీశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2001లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, 2003లో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి,2007లో దేశముదురు, 2007లో చిరుత,ఇద్దరమ్మాయిలతో, 2015లో టెంపర్, 2019లో ఇష్మార్ట్ శంకర్ ఇలా చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించాడు. ఒక్కో సినిమాకు 6నుంచి 8కోట్లు అందుకుంటాడు. తమ్ముడు సాయిశంకర్ హీరోగా 143తీసి, నిర్మాతగా, డైరెక్టర్గా వ్యవహరించాడు.అలాగే కొడుకు ఆకాష్ పూరీని హీరోగా పెట్టి మెహబూబా మూవీ తీసాడు. బుక్స్ బాగా చదువుతాడు. బ్యాంకాక్ అంటే ఇష్టం. నెట్ వర్త్ 65కోట్లు ఉంటుందట. 25లక్షల నుంచి 2కోట్ల 75లక్షల విలువ చేసే మూడు కార్లున్నాయి. జూబ్లీ హిల్స్ లో ఉండే ఈయన ఇల్లు ఖరీదు 5కోట్ల వరకూ విలువ చేస్తుంది.