బుల్లితెరపై నటిస్తున్న సొంత అన్న తమ్ముళ్లు ఎంత మంది…?
Tv Serials Brothers :వెండితెర మీదనే కాదు,బుల్లితెర మీద కూడా వారసత్వం కొనసాగుతోంది. వెండితెరకు ధీటుగా గుర్తింపు రావడంతో బుల్లితెరవైపు నటీనటులు వస్తున్నారు. ఇక సొంత బ్రదర్స్ కూడా ఈ రంగంలో ఉన్నారు. అలాంటి వాళ్ళ జాబితా తీసుకుంటే, సావిత్రమ్మ గారబ్బాయి మూవీలో తాజాగా వచ్చిన బాలాదిత్య ,కౌశిక్ ఇద్దరూ బ్రదర్స్.
ఇక గోరింటాకు సీరియల్ లో నిఖిల్, అలాగే కస్తూరి సీరియల్ లో హీరోగా నటిస్తున్న నాగార్జున ఇద్దరు అన్నదమ్ములు. అలాగే కస్తూరి సీరియల్ లో హీరో తండ్రి వాసుదేవ్ ,రుద్రమదేవి సీరియల్ హీరో శ్రీధర్ ఇద్దరూ సొంత అన్నదమ్ములే.
ప్రేమ ఎంత మధురం సీరియల్ వెంకట్, కృష్ణ ఇద్దరూ బ్రదర్స్ అవుతారట. కార్తీక దీపం హీరో నిరుపమ్, నెంబర్ వన్ కోడలు లో హీరోగా నటిస్తున్న జయదనుష్ ఇద్దరూ అన్నదమ్ములు. అలాగే నటుడు ఇంద్రనీల్, అరవింద్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు.