MoviesTollywood news in telugu

టాలీవుడ్ లో హిట్ అయ్యి బాలీవుడ్ లో ప్లాప్ అయిన దర్శకులు…?

Tollywood Movies:ఒకచోట హిట్ అయిందని మరోచోట సినిమా తీస్తే అక్కడ దెబ్బతిన్న దర్శకులు చాలా మంది ఉన్నారు. అన్నీ సినిమాలు అన్ని చోట్లా క్లిక్ కావు. ముఖ్యంగా సౌత్ డైరెక్ట‌ర్లు త‌మ సొంత సినిమాల‌ను బాలీవుడ్ లో రీమేక్ చేసి, అనుకున్న రేంజ్ లో స‌క్సెస్ అందు కోలేదు. ఎస్ జె సూర్య త‌న కెరీర్ లో బెస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ తో తీసిన ఖుషి. దీన్ని హిందీలో ఇదే పేరుతో 2003లో రీమేక్ చేస్తే, సీన్ రివర్స్ అయింది. కొరియోగ్రాఫర్ ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో సంచ‌న‌ల విజ‌యం సాధించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ బాలీవుడ్ లో ర‌మ‌యా వ‌స్త‌వ‌యా పేరుతో రీమేక్ చేస్తే, డిజాస్టర్ అయింది.

దేవా క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్ర‌స్థానం సూప‌ర్ హిట్ అయిందని బాలీవుడ్ లో సంజ‌య్ ద‌త్ హీరోగా తీస్తే అస్స‌లు ఎడ్రెస్ లేకుండా పోయింది. మరో కొరియోగ్రాఫర్ రాఘ‌వ లారెన్స్ తెలుగులో కాంచ‌న‌ మూవీతో హిట్ అందుకుని, ల‌క్ష్మీ బాంబ్ పేరుతో బాలీవుడ్ లో తీస్తే, డిజాస్టర్ గా మిగిలింది. ఇక గౌత‌మ్ మీనన్ ద‌ర్శ‌క‌త్వంలో నాగచైతన్య, సమంత జంటగా వచ్చిన ఏమాయ చేసావే మూవీ ఏక్ దివానా తా పేరుతో రీమేక్ చేస్తే, బాలీవుడ్ లో బోల్తా కొట్టింది.

ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన సినిమా అప‌రిచితుడు.తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ రేంజిలో హిట్ కొట్టింది. విక్ర‌మ్ చేసిన మూడు క్యారెక్ట‌ర్స్ అద్భుతంగా పోషించాడు. సౌత్ లో అప్ప‌ట్లో సంచ‌న‌ల విజ‌యం సాధించిన ఈ మూవీని మ‌ళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు శంక‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో హీరోగా ర‌ణ్ వీర్ ను ఎంపిక చేసుకున్నాడు. అప్పటి పరిస్థితిలో హిట్ కొట్టిన అప‌రిచితుడు ఇప్పుడు ఆ రేంజ్ లో బాలీవుడ్ లో ఆదరణకు నోచుకుంటుందా లేదా అనేది వెయిట్ చేయాలి.