టాప్ మ్యూజిక్ డైరెక్టర్ భార్యను గుర్తు పట్టారా…ఏమి చేస్తుందో తెలుసా?
Thaman wife srivardhini :గత ఏడాది సంక్రాంతికి అలవైకుంఠపురంలో మూవీలో సాంగ్స్ ఏ రేంజ్ లో అదిరిపోయాయో ఎన్ని వ్యూస్ వచ్చాయో చెప్పలేం. అలాంటి సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్ టాప్ లిస్ట్ లో చేరిపోయాడు. అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్. తమన్ ప్రముఖ దర్శకులు,నిర్మాత,అలాగే నటులు అయిన ఘంటసాల బలరామయ్య మనవడు. తమన్ కుటుంబానికి కూడా సంగీత నేపథ్యం ఉంది.
తమన్ తండ్రి ఘంటసాల శివ కుమార్ పలు సినిమాలకు డ్రమ్మర్ గా పనిచేయగా, థమన్ తల్లి సావిత్రి ప్రముఖ సింగర్. అలాగే సింగర్ బి.వసంత కూడా తమన్ కి బంధువులు అవు తారు. థమన్ భార్య శ్రీ వర్ధిని కూడా ప్రముఖ సింగర్. శ్రీ వర్ధిని తెలుగు,తమిళ్ లో ఎన్నో పాటలు పాడారు. తెలుగులో గోవిందుడు అందరివాడేలే, అల్లరి పిడుగు, బాడీగార్డ్, నా ఆటోగ్రాఫ్, స్టూడెంట్ నెంబర్ 1, మిరపకాయ్, యజ్ఞం,శక్తి,తీన్ మార్, అభిమన్యుడు సినిమాల్లో పాటలు పాడారు.
ఇటీవల వచ్చిన మిస్ ఇండియా సినిమాలో శ్రీ వర్దిని కూడా ఒక పాట పాడారు.అంతే కాకుండా ఈటీవీలో ప్రసారమయిన స్వరాభి షేకం షోలో కూడా ఎన్నో పాటలు పాడారు. “మళ్లీ మళ్లీ’ మూవీతో 2008లో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి… కిక్, ఆంజనేయులు, బృందావనం, నాయక్, దూకుడు, బిజినెస్ మాన్, బాద్షా, మిరపకాయ్, సరైనోడు, రామయ్యా వస్తావయ్యా ,రేసుగుర్రం ఇలా పలు మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. తమిళ్, కన్నడ, హిందీ, మూవీస్ కూడా సంగీతం అందించి మెప్పించాడు.