ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తు పట్టారా….ఇప్పుడు ఏమి చేస్తుందో…?
Rajanna child artist :చిన్నప్పుడు ఒకటో రెండో సినిమాలకు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి, తరవాత వరుస ఆఫర్స్ లో దూసుకుపోయి, స్టడీస్ సాకుతో ఇండస్ట్రీకి దూరమై, పెద్దయ్యాక మళ్ళీ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి, ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మొదటగా ఒకప్పటి అందాల తార శ్రీదేవి ని చెప్పుకోవాలి. టాలీవుడ్, బాలీవుడ్ లలో స్టార్ హోదా తెచ్చుకుంది.
అలాగే రంభ,మీనా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరియర్ స్టార్ట్ చేసి, స్టార్ హీరోయిన్స్ అయ్యారు.ఇక టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం, అది కూడా చిన్నా చితకా సినిమా కాకుండా భారీ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని ఆసక్తిగా ఓ బ్యూటీ ఎదురుచూస్తోంది. అందుకే కొన్ని సినిమాలు ఆఫర్ వచ్చినా ఒప్పుకోవడం లేదట. ఆమె ఎవరో కాదు,కింగ్ నాగార్జున రాజన్న మూవీలో మల్లమ్మ అనే పాత్రలో నటించిన చిన్న అమ్మాయి బేబీ.
ఈ అమ్మడు బాలనటి ప్రస్తుతం 20 ఏళ్ళు పూర్తి చేసుకొని టీనేజ్ లో ఎంట్రీ ఇచ్చింది. అందం, ఆకర్షణ కూడా కలిగిన ఈ అమ్మడు అప్పుడప్పుడు రియాలిటీ షోలలో కనిపిస్తూ, సందడి గా కనిపిస్తోంది. ఈ మధ్య ఈ బ్యూటీ ఫోటోషూట్ లు కూడా స్టార్ట్ చేసి, తనను తాను ప్రమోట్ చేసుకుంటోంది. బిగ్ ఎంట్రీ కోసం చూస్తోంది.