యాంకర్ అనసూయ భర్త ఏమి చేస్తున్నాడో తెలుసా?
Anchor Anasuya Husband : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆమె బుల్లితెరలోను,వెండితెరలోను దూసుకుపోతోంది. బుల్లితెరలోను వెండితెరలోను సమానంగా క్రేజ్ సంపాదించుకుంది అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
అలాగే కుటుంబం విషయంలో కూడా చాలా కేరింగ్ తీసుకుంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వీడియోను షేర్ చేసి అభిమానులకు కనువిందు చేస్తూ ఉంటుంది. అయితే అనసూయ గురించి అందరికీ తెలుసు కానీ అనసూయ భర్త గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అనసూయ కాలేజీలో ఉన్నప్పుడే భర్త సుశాంత్ భరద్వాజ్ తో పరిచయం అవడం ఆ తర్వాత ప్రేమగా మారటం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం అన్ని వరుసగా జరిగిపోయాయి.
ఇక వారికి శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త సుశాంక్ భరద్వాజ్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా చేస్తున్నాడు. గతంలో అనసూయ తన భర్తను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం కూడా చేసింది. ప్రస్తుతం అనసూయ పుష్ప సినిమాలోనూ ఒక వెబ్ సెరిస్ లో నటిస్తుంది. థాంక్యూ బ్రదర్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.