MoviesTollywood news in telugu

కళ్యాణ వైభోగం సీరియల్ లో నటించే ప్రశాంత్ కి మహేష్ బాబుకి రిలేషన్ ఏమిటో…?

Kalyana Vaibhogam Serial :జి తెలుగులో ప్రసారమవుతున్న కల్యాణ వైభోగం సీరియల్ ఆడియన్స్ ని బాగా అలరిస్తోంది. టాప్ రేటింగ్ లో ఉండే ఈ సీరియల్ లో నిత్యా,మంగ కల్సి క్లైమాక్స్ కి వస్తుందన్నది అందరి అంచనా. కానీ మరో కొత్త కథతో సీన్ రివర్స్ అయింది. దివ్య,అభి ఇద్దరూ పెద్దవాళ్ళు అయిపోతారు. దివ్య రోల్ ని మేఘనా లోకేష్ చేస్తుంటే, అభి రోల్ ని ఇద్దరు చేస్తున్నారు. ఒకరేమో గంగ మంగ సీరియల్ ఫేమ్ సిద్ధూ. మరొకరు టిక్ టాక్ ద్వారా పాపులార్టీ తెచ్చుకున్న ప్రశాంత్.

అయితే వీళ్ళిద్దరిలో రియల్ అభి ఎవరో తెలీదు. అయితే ప్రశాంత్ వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాలలో డిసెంబర్ 27న జన్మించాడు. చూడ్డానికి సూపర్ స్టార్ మహేష్ బాబులా ఉండడంతో అందరూ అతన్ని జూనియర్ మహేష్ బాబుగా పిలుస్తుంటారు. ఇక మహేష్ బాబు అంటే ప్రశాంత్ కి చాలా ఇష్టం. ఒకసారి నమ్రత కూడా ప్రశాంత్ పిక్ ని షేర్ చేసింది.

మహేష్ బాబు సాంగ్స్ ని కవర్ సాంగ్స్ గా ఫర్ ఫార్మ్ చేసాడు. టిక్ టాక్ లో 2లక్షలమందికి పైగా ఫాలోవర్స్ గల ప్రశాంత్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేసాడు. తన బ్రదర్ తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. టిక్ టాక్ స్టార్ గా మారిన ప్రశాంత్ సీరియల్స్ లో నటించడం ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. జబర్దస్త్, పోలీస్ రాజా వంటి షోస్ లో కూడా పాల్గొన్నాడు. తాను నటించే తొలిసీరియల్ ఇదే. మరి ఇతడి భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి..