ఉదయ్ కిరణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్
Telugu Hero Uday Kiran :ఇండస్ట్రీ చిత్ర విచిత్రమైనది. ఎంత వేగంగా ఓ హీరోకు క్రేజ్ పెరుగుతుందో, అంతే వేగంగా క్రేజ్ తగ్గిపోతోంది. ఓ వెలుగు వెలిగిన వాళ్ళు, సడన్ గా మార్కెట్ నుంచి డౌన్ అయిపోతారు. ఇక ఒకప్పుడు లవర్ బాయ్ గా గుర్తింపు పొందిన ఉదయ్ కిరణ్ వరుస హిట్స్ తో దూసుకెళ్లి, వరుస పరాజయాలు వెంటాడి, విధి వక్రించి చనిపోయాడు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన చిత్రం మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చింది. వెంటనే తేజ డైరెక్షన్ లోనే నువ్వు నేను మూవీ వచ్చి హిట్ ఇచ్చింది.
మనసంతా నువ్వే.. ఇలా వరుస విజయాలతో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. యూత్ లో ఉదయ్ కిరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటు రెమ్యునరేషన్ కూడా పెరిగింది. అయితే ఒక దశలో వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు వచ్చి పడ్డాయి. ఇక 2014 సంవత్సరం జనవరి నెల 5వ తేదీన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని ఈలోకం నుంచి నిష్క్రమించాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు వేర్వేరు కారణాలు వినిపించినా కచ్చితమైన కారణాలు ఇప్పటికీ తెలియలేదు.
అయితే ఆహ నా పెళ్లంట, పూల రంగడు సినిమాలతో హిట్లు కొట్టిన వీరభద్రం చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని, దాంతో ఉదయ్ కిరణ్ తో తనకు ఏర్పడిన పరిచయం వల్ల తాను 2005 సంవత్సరంలో ఒక కథ చెబితే ఒకే చెప్పాడని, అయితే తన కథకు ఓకే చెప్పిన సమయంలోనే ఉదయ్ కిరణ్ కు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి పిలుపు రావడంతో ఊహించని విధంగా తన సినిమా క్యాన్సిల్ అయిందని వీరభద్రం చౌదరి తెలిపారు.సినిమా క్యాన్సిల్ అయినప్పటికీ అతడు చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు.