రష్మిక పక్కన ఉన్న ఈ పాప ఎవరో తెలుసా?
Tollywood Heroine rashmika mandanna :వరుస హిట్స్ తో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్స్ లో రష్మికా మందన్నా ఒకరు. ఇప్పటికే వరుస విజయాలతో సినిమా సినిమాకు సక్సెస్ రేటును పెంచుకుంటున్న రష్మిక తాజాగా సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోడానికి రష్మిక సిద్ధం అవుతోంది. అయితే కోవిడ్ ఉదృతి నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ కు వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్.
తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు, కన్నడ భాషలతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం అవకాశాలను అందిపుచ్చుకుంటున్న రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక రష్మిక మందన్నా క్యూట్ సిస్టర్ షిమాన్ మందన్నా పుట్టినరోజు సందర్బంగా షిమాన్ తో దిగిన కొన్ని ఫోటోలను రష్మిక సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ పోస్టుల ద్వారా రష్మిక తన చెల్లిపై ఉన్న ప్రేమ వెల్లడించింది. బాలీవుడ్ ఆఫర్లతో రష్మిక మందన్నా బిజీ గా మారడంతో తెలుగు,కన్నడ భాషలకు ఈమె గుడ్ బై చెబుతుందని మరోవైపు జోరుగా ప్రచారం నడుస్తోంద.
హిందీలో అమితాబ్ మూవీతో బిజీగా ఉన్న రష్మిక తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ప్రస్తుతం రష్మిక సినిమా షూటింగ్ కొరకు హైదరాబాద్ కే పరిమితమవ్వడంతో చెల్లి పుట్టినరోజు వేడుకలకు హాజరైంది. రష్మిక తన సిస్టర్ ను డార్లింగ్ బేబీ అంటూ సంబోధించడంతో పాటు చెల్లిని ఎప్పుడూ తాను బాధ పెట్టనని సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఇంటికి చేరుకుంటానని రష్మిక వివరించింది. గతంలో షియాన్ మందన్నాతో దిగిన ఫోటోలను కూడా రష్మిక సోషల్ మీడియా లో షేర్ చేసింది.