టాప్ 10 టాలీవుడ్ కమెడియన్ల పారితోషికం ఎంతో చూడండి..!
Tollywood Top comedians remunerations : సినిమా పరిశ్రమలో ఎవరు ఏంచేసినా అది వార్తే. సెన్షేషనే. ఇక వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత కూడా జనంలో ఎక్కువే. ముఖ్యంగా రెమ్యునరేషన్స్ గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు కామెడీ పండిస్తున్న వాళ్లకు ఎంత వస్తోందో అనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. మెరుగైన సంపాదన లభిస్తోందన్న టాక్ కూడా వస్తోంది. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి, పెద్దయ్యాక కామెడీ కింగ్ గా మారిన అలీ పలు టివి షోస్ కూడా చేస్తున్నాడు. ఒక్కో రోజుకి మూడున్నర లక్షలు పారితోషికం అందుకుంటాడని అంటున్నారు. వెండితెరపై కన్పిస్తే చాలు నవ్వులు విరుస్తాయి బ్రహ్మానందం ను చూస్తే. అంతలా హాస్యబ్రహ్మగా ఎదిగి గిన్నీస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకున్నాడు. రోజుకి 5లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటాడని టాక్.
రచయితగా ఎంట్రీ ఇచ్చి, దర్శకుడిగా, నటుడిగా మెప్పించి ఇప్పుడు కమెడియన్ గా దూసుకెళ్తున్న పోసాని కృష్ణమురళి రోజుకి రెండున్నర లక్షలు అందుకుంటారని టాక్. కమెడియన్ గా వచ్చి, హీరోగా కూడా సక్సెస్ అందుకుని,మళ్ళీ కమెడియన్ దూసు కెళ్తున్న సునీల్ రోజుకి నాలుగు లక్షల వరకూ తీసుకుకుంటున్నట్లు టాక్. ఇక సునీల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే వెన్నెల కిషోర్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఒక్కో సినిమాకు మూడు లక్షలు పుచ్చు కుంటాడని టాక్. అలాగే శ్రీనివాసరెడ్డి కూడా తన కామెడీతో ఆకట్టుకుంటూ హీరోగా కూడా ప్రయత్నాలు చేసి, కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. కమెడియన్ గా రోజుకి రెండు లక్షలు అందుకుంటున్నట్లు టాక్.
ఖడ్గం మూవీలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో కామెడీ కింగ్ గా మారిన పృథ్వి రాజ్ వరుస కమెడియన్ పాత్రలతో రాణిస్తూ, ప్రస్తుతం బాగానే సంపాదిస్తున్నాడు. కమెడియన్ గా , సీరియస్ కమెడియన్ గా నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న సప్తగిరి రోజుకి రెండు లక్షల రూపాయలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి మూవీలో ఫ్రెండ్ పాత్రలో రాణించి, తనకంటూ ఓ కామెడీ ట్రాక్ సృష్టించుకున్న రాహుల్ రామకృష్ణ తాజాగా జాతిరత్నాలులో తన సత్తా చాటాడు. రోజుకి 2లక్షలు అందుకుంటాడని అంటున్నారు. పెళ్లి చూపులు సినిమాలో హీరో ఫ్రెండ్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి పలు సినిమాల్లో నటించి, తాజాగా జాతిరత్నాలు మూవీతో బాగా ఆకట్టుకున్నాడు. యితడు రోజుకి రెండు లక్షలు అందుకుంటాడని వినికిడి.