గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Gangotri baby girl kavya : అలనాటి అందాల తార శ్రీదేవి మొదలుకుని ప్రస్తుతం ఉన్న అనూ ఇమ్మాన్యూయేల్ వరకు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ గా ఎంట్రీ ఇచ్చి,ఎన్నో సినిమాలతో ఆకట్టుకుని పెద్దయ్యాక హీరోయిన్స్ గా కూడా రాణిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించినవాళ్లలో చాలామంది 15 ఏళ్లకే హీరోయిన్స్ గా వెండితెరమీద గానీ, బుల్లితెర మీద గానీ కెరియర్ స్టార్ట్ చేసేసి, అదరగొట్టేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే, అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన గంగోత్రి మూవీ లో చిన్నప్పటి గంగోత్రి పాత్రలో కావ్య అనే చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. పెద్దయ్యాక ఆ పాత్రలో అతిధి అగర్వాల్ నటించింది. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ చేసిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ మూవీ వచ్చి అప్పుడే 18 ఏళ్ళు అయిపొయింది.
ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య వయస్సు ఇప్పుడు 22 ఏళ్ళు. ఈ అమ్మడు తన స్టడీస్ పూర్తి చేసుకొని, ఇప్పటికే మోడలింగ్ లో అడుగుపెట్టింది. అంతేకాదు, యాక్టింగ్ లో కూడా శిక్షణ తీసుకొని ఫోటోషూట్స్ కూడా మొదలు పెట్టింది. ఇక సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తన ఫోటోషూట్ ని అందరికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఇదంతా ఎందుకంటే హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తోంది.