హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ ని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో…?
Hitler Gari Pellam Serial :హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తూ అలరిస్తున్న భాను అసలు పేరు గోమతి ప్రియ. షార్ట్ ఫిలిమ్స్, ఒరియా అనే సీరియల్ లో నటించిన ఈమె మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో చేస్తోంది. అయితే ఈ పాత్రకు ముగ్గురు పాపులర్ హీరోయిన్స్ రిజెక్ట్ చేశారట. వారు ముగ్గురు ఎవరో తెలుసుకుందాం.
జి తెలుగులో ప్రసారమయ్యే రాధమ్మ కూతురుతో శ్వేతా పాత్రలో నటిస్తున్న దీప్తి మన్నే కన్నడ అమ్మాయి. మోడలింగ్ చేస్తూ పద్మావతి అనే కన్నడ సీరియల్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సినిమాల్లో కూడా చేసింది. రాధమ్మ కూతురుతో నటిస్తూ తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది.
నెంబర్ వన్ కోడలు సీరియల్ లో సరస్వతి పాత్రలో నటిస్తున్న మధుమిత మంచి నటనతో టిఆర్పి రేటింగ్ లో దూసుకెళ్తోంది. హిందీ, కన్నడ సీరియల్స్ లో నటించి ఆడియన్స్ ఆదరణ చూరగొన్న ఈమె తెలుగులో మనసున మనసై సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. జి తెలుగులో ప్రసారమవుతున్న మిఠాయికొట్టు చిట్టెమ్మ సీరియల్ లో అంజనా శ్రీనివాస్ బాగా ఆకట్టుకుంటోంది. గోరంత దీపం, బంగారు గాజులు, పున్నాగ సీరియల్స్ తో ఆకట్టుకున్న ఈమె కన్నడ సీరియల్ లో కూడా నటించింది. ఈ ముగ్గురు హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ ని రిజెక్ట్ చేశారు.