వేడి నీటితో కరోనాకు చెక్ పెట్టవచ్చా….ఇందులో నిజం ఎంత ?
Carona Hot Water :కరోనా వచ్చి దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ లో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. కరోనా వచ్చాక ట్రీట్ మెంట్ ఒకరకంగా ఉంటుంది. అయితే రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిలో వేడి నీళ్లు ఒకటి.
కరోనా వ్యాప్తి పెరిగాక చాలా మంది ఈ వేడి నీళ్ల చిట్కాను పాటిస్తున్నారు. అయితే వేడినీళ్లను తాగితే కరోనా వైరస్ చనిపోతుందా అని మనలో చాలా మందికి వచ్చే సందేహం. వేడినీళ్లు చిట్కా గురించి వైద్యులు ఏమి చెప్పుతున్నారో చూద్దాం. కరోనా వైరస్ వ్యాధి యొక్క ప్రధానమైన లక్షణం జలుబు.దీన్ని మొదట్లోనే కంట్రోల్ చేసే గుణం గోరు వెచ్చని నీళ్లలో ఉంది.అలాగే గోరు వెచ్చటి నీళ్లు తాగటం వలన ఒత్తిడి నుండి బయట పడతారు.
జలుబు,దగ్గు తరచూ వచ్చే వారు కూడా క్రమం తప్పకుండ వేడి నీళ్లు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్నీ బాగా గుర్తుంచుకోవాలి. వేడినీటి వల్ల కరోనా రాదని అనుకోకూడదు. కరోనా రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందే. ఆ జాగ్రత్తల్లో భాగమే ఈ వేడి నీళ్ల చిట్కా.సాధారణమైన చల్లటి నీరు తాగడం కంటే కూడా ఈ వెచ్చటి నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.