పెళ్ళిపీటల దాకా వచ్చి ఆగిపోయిన సెలబ్రిటీల పెళ్లిళ్లు…ఒక లుక్ వేయండి
Tollywood celebrity breakups :పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని, పెళ్లంటే నూరేళ్ళ పంట అని అంటూంటారు. ఇక సినిమా స్టార్స్ అయితే ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. అయితే కొంతమంది పెళ్లిళ్లు పీటల వరకూ వచ్చాక ఆగిపోయాయి. అందులో మొదటగా చెప్పాలంటే, స్టార్ హీరోయిన్ నయనతార, ప్రభుదేవా పెళ్లి వార్త హల్ చల్ చేసాక సడన్ గా ఆగిపోయింది.
అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ విషయంలో అలానే జరిగింది. అక్కినేని వారి వంశంలో మూడో తరానికి చెందిన నాగచైతన్య , స్టార్ హీరోయిన్ సమంత ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే అతడి సోదరుడు అఖిల్ కూడా శ్రేయా భూపాల్ ని ప్రేమించి నిశ్చితార్ధం కూడా జరిగాక కేన్సిల్ అయింది. మెగాస్టార్ చిరంజీవి తనయ సుష్మితతో లవర్ బాయ్ ఉదయ కిరణ్ పెళ్లి ఫిక్స్ చేసి, నిశ్చితార్ధం అయ్యాక కేన్సిల్ అయింది. ఆతర్వాత ఉదయ్ మరో అమ్మాయిని పెళ్ళాడి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళ నటుడు విశాల్ – అనీషా , రక్షిత్ శెట్టి – రష్మిక మందన్నా, శింబు – హన్సిక, ఇలియానా – ఆండ్రో నిబోన్ , త్రిష – వరుణ మణియన్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ – శిల్పాశెట్టి, రణదీప్ కపూర్ – దీపికా పదుకునే , శృతిహాసన్ – మైకోల్ కోర్స్ ఇలా చాలా జంటలు పెళ్ళిపీటల వరకూ వచ్చి ఆగిపోయాయి.