బొప్పాయితో కరోనాకు చెక్..దీనిలో నిజం ఎంత
Papaya In Telugu :కరోనా పేరు చెప్పితేనే భయపడే రోజులు. అంతలా వ్యాపిస్తుంది. సంవత్సరం దాటిన కరోనా ఇంకా ప్రతాపం చూపుతూనే ఉంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంది. చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాక్సిన్ వచ్చినా కొంత మంది వేయించుకున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ కూడా కొరతగానే ఉంది.శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోమని డాక్టర్స్ చెప్పుతున్నారు. దాంతో ప్రజలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచటానికి బొప్పాయి చాలా బాగా సహాయపడుతుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచి వైరస్ల బారి నుంచి రక్షిస్తుంది.అందువల్ల బొప్పాయిని తరచూ తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ను కలిగించే బాక్టీరియాను అరికట్టేందుకు సహాయపడుతుంది.
బొప్పాయిలో సమృద్ధిగా ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ కంటెంట్ లు గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. బొప్పాయి మంచిది కదా అని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే బొప్పాయి జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే కొన్ని సమస్యలు వచ్చే అవకావం ఉంది.