హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఈ తప్పులు చేయకండి.. చేస్తే రిస్కే
Home isolation latest news corona virus covid : కరోనా సెకండ్ వేవ్ చాలా చాలా ఎక్కువగా ఉంది కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక వైపు కొనసాగుతున్న వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. కరోనా తీవ్రతను బట్టి కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు కొంతమంది హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తున్నారు ఆ తప్పులే ప్రమాదంలో పాడేస్తున్నాయి. హోం ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు తెలుసుకుందాం.
హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు వారికి ఇష్టం వచ్చినట్టు మందులు వాడేస్తూ ఉంటారు అలా కాకుండా డాక్టర్ సూచనలు అనుసరించి మందులు వాడాలి. గాలి వెలుతురు ఉండే గదిలో ఒంటరిగా ఉండాలి ఎవరినీ కలవకూడదు మాట్లాడకూడదు. ఆ విధంగా ఒంటరిగా ఉన్నప్పుడు మానసికంగా కృంగి పోయే అవకాశం ఉంది.
ఆ సమయంలో మంచి సినిమాలు చూడటం ఫోన్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడటం మ్యూజిక్ వినడం చేస్తే ఒంటరిగా ఉన్నామనే భావన లేకుండా మంచి కాలక్షేపంగా ఉంటుంది. ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. పల్స్ రేటు 94 శాతం కంటే తక్కువగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ సలహా లేకుండా ఆక్సిజన్ సిలిండర్ ఉపయోగించకూడదు అలాగే మాస్కు తప్పనిసరిగా వాడాలి తరచుగా చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి రోజుకి రెండు సార్లు ఆవిరి పట్టాలి.