ఈ హీరో ని గుర్తుపట్టారా… ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా… ?
Tollywood young hero prince :కొంతమంది హీరో హీరోయిన్లకు ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని కారణాల వల్ల గుర్తింపు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. 2012వ సంవత్సరంలో తేజ దర్శకత్వంలో నీకు నాకు డాష్ డాష్ సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ప్రిన్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. ప్రిన్స్ నటనకు మంచి మార్కులు పడిన అవకాశాలు పెద్దగా రాలేదు
బస్‌స్టాప్,రొమాన్స్ వంటి సినిమాలు చేసి కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత కథల విషయంలో అవగాహన లేకపోవటంతో వరుస ప్లాప్ లు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా సినిమా విడుదల అయినట్టు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. 2017 వ సంవత్సరం లో బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో లో పార్టిసిపెట్ చేశాడు అయినా పెద్దగా కలిసి రాలేదు. ఒక్క అవకాశం కూడా రాలేదు. ఒక్క హిట్ పడితేనే కానీ సినీ కెరీర్ గాడిలో పడదు. ఆ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రిన్స్.