MoviesTollywood news in telugu

బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..!

Top 10 Telugu movies with highest TRP :యంగ్ రెబల్ స్టార్ హీరోగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన విజువల్ వండర్ ‘బాహుబలి 2’ వరల్డ్ వైడ్ ఖ్యాతిని పొందింది. భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ రికార్డ్ ని ఇప్పటికీ ఏదీ అధిగమించలేదు. అయితే బుల్లితెర మీద విషయానికి వచ్చేసరికి 22.7 టీఆర్పీ రేటింగ్ తో మూడో ప్లేస్ లో కి వచ్చేసింది. ఇక రాజమౌళి – ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ‘బాహుబలి బిగినింగ్ ‘ సినిమా 21.54 రేటింగ్ తో ఆరో ప్లేస్ లో కి వెళ్ళిపోయింది. అయితే గత ఏడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా టీవీల్లో కూడా విశేష స్పందన తెచ్చుకుంది. టాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా 29.4 టీఆర్పీ నమోదు చేసి రికార్డ్ సృష్టించింది. మొదటి ప్లేస్ ఆక్రమించింది.

ఇక గత సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బుల్లితెర పై కూడా సత్తా చాటింది. జెమినీ టీవీలో ప్రదర్శించబడి 23.4 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ సాధించి రెండో స్థానం కొట్టేసింది. అంతేకాదు, రెండోసారి మూడో సారి టెలికాస్ట్ లో కూడా హయ్యెస్ట్ టీఆర్పీని రాబట్టి సంచలనం సృష్టించింది. అలాగే మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’ 22.54 టీఆర్పీ తో 4వ స్థానంలో ఉంది. ఇక బన్నీ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన’డీజే-దువ్వాడ జగన్నాథం’ డీజే సినిమా 21.7 రేటింగ్ తో తర్వాతి ప్లేస్ లో నిలిచింది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఫిదా’ 21.31 టీఆర్పీ రేటింగ్ సాధించి 7వ స్థానం దక్కించుకుంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన’గీత గోవిందం’ సినిమా 20.80 రేటింగ్ తో తర్వాత స్థానంలో ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా 20.69 రేటింగ్ తో హవా చూపించింది. అలానే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ రూపొందించిన సావిత్రి బయోపిక్ ‘మహానటి’ కి 20.21 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ ‘రంగస్థలం’ మూవీ 19.5 టీఆర్పీ తెచ్చుకుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో బుల్లితెరపై వచ్చే సినిమాల రేటింగ్ కూడా అదిరిపోతోందని టాక్.