పనస గింజలు ఇమ్మ్యూనిటి పెంచి కరోనాకు చెక్ పెడుతుందా…దీనిలో నిజం ఎంత ?
JackFruit Seeds benefits :ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. అలాంటి ఆహారాలలో పనస గింజలు ఒకటి.
పనస పండు అంటే అందరికీ ఇష్టమే చాలా తియ్యగా ఉండే ఈ పండు తొనలు అందరూ ఇష్టంగా తినడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అందరూ తన తింటాను తొనలో ఉండే గింజలు పాడేస్తూ ఉంటారు. కొంతమంది ఈ గింజలను ఉడికించుకొని కాల్చుకుని తింటారు. ఈ గింజల లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
ఈ గింజలను తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు ఎందుకంటే దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కరోనా ఉన్న ఈ సమయంలో ప్రతి ఒక్కరిలోనూ రోగ నిరోధక శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ గింజలను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గింజల లో ఉండే విటమిన్ ఏ కంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ గింజలలో ఉండే కాల్షియం పొటాషియం మెగ్నీషియం జింక్ ఖనిజాలు ఎముకలకు బలాన్ని ఇవ్వటమే కాకుండా గుండె సమస్యలు లేకుండా చేస్తుంది.