తన తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న టాప్ హీరోలు వీరే
Tollywood Heroes and sons :టాలీవుడ్ లో తండ్రీ కొడుకులు కల్సి నటించిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే కూతుళ్లు హీరోయిన్స్, నటులుగా మారాక తండ్రిటి కల్సి వెండితెరను పంచుకున్నారు. అయితే తండ్రులతో కల్సి నటించిన హీరోలు ఎవరో పరిశీలిస్తే, సీనియర్ ఎన్టీఆర్ తో కల్సి నందమూరి బాలయ్య ఇద్దరూ కల్సి తాతమ్మ కల నుంచి 7 సినిమాల్లో కల్సి నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో కల్సి కొడుకు నాగార్జున ఇద్దరూ ఇద్దరే, అగ్నిపుత్రుడు, శ్రీరామదాసు, మనం వంటి మూవీస్ లో కల్సి నటించారు.
చిన్నప్పుడు చదువుకునే రోజుల్లోనే తండ్రితో కల్సి గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం వంటి సినిమాల్లో కృష్ణతో కల్సి మహేష్ బాబు నటించాడు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాణరాజు కొడుకు ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఐచ్ఛిక పెదనాన్న కృష్ణంరాజుతో కల్సి బిల్లా,రెబెల్ వంటి మూవీస్ లో చేసారు. రాధేశ్యాం మూవీలో కూడా ఇద్దరూ కల్సి నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనకొడుకు రామ్ చరణ్ తో కల్సి మగధీర,బ్రూస్ లీ,ఖైదీ నెంబర్ 150 వంటి మూవీస్ లో నటించాడు. ఇక ఆచార్య మూవీలో కూడా ఇద్దరూ కలసి నటిస్తున్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన పెద్ద కొడుకు విష్ణుతో కల్సి పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ వంటి మూవీస్ లో కల్సి నటించారు. మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాల్లో చిన్న కొడుకు మంచు మనోజ్ కూడా నటించారు. మనం, ప్రేమమ్ మూవీస్ లో పెద్ద కొడుకు నాగచైతన్యతో కల్సి నాగార్జున నటించారు. చిన్న కొడుకు అఖిల్ తో కల్సి మనం,సిసింద్రీ వంటి మూవీస్ లో నటించాడు. కృష్ణం వందే జగద్గురుం మూవీలో రానాతో కల్సి బాబాయ్ వెంకీ ఓ సాంగ్ లో నటించాడు.