తెలుగులో ఎన్ని రీమేక్ సీరియల్స్ వస్తున్నాయో తెలుసా?
Top Serials Remake in Telugu :నిజం చెప్పాలంటే వెండితెరను మించి పోయింది బుల్లితెర. సినిమాలకు వెళ్లని వాళ్ళు ఉన్నారేమో గానీ, సీరియల్ చూడని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే బుల్లితెర నటులకు మంచి ఫాన్ ఫాలోయింగ్ వచ్చేస్తోంది. ఇక సినిమాలు రీమేక్ ఎలా చేస్తున్నారో సీరియల్స్ కూడా అదే బాటన నడుస్తున్నాయి. కొత్త కొత్త సీరియల్స్ చాలా ఛానల్స్ లో నడుస్తున్నాయి. అందులో చాలావరకూ రీమేక్ కావడం విశేషం. హిందీ, మలయాళం, తమిళం ఇలా పలు భాషల్లో బాగా నడిచిన సీరియల్స్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
తాజాగా స్టార్ మాలో నడుస్తున్న జానకి కలగనలేదు సీరియల్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. హిందీలో సూపర్ హిట్ టాక్ అందుకున్న సీరియల్ ని తెలుగులో జానకి కలగనలేదు పేరుతొ రీమేక్ చేసారు. అలాగే స్టార్ మా లో ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ ప్రసారమవుతోంది. హిందీలో సక్సెస్ గా నడిచిన సీరియల్ కి రీమేక్ ఇది. బెంగాలీ సీరియల్ కి రీమేక్ గా తీసిన కృష్ణ తులసి కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.
అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ త్వరలో స్టార్ మాలో ప్రసారం కానుంది. మలయాళంలో సక్సెస్ అనుకున్న ఈ సీరియల్ ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. జి తెలుగులో త్వరలో రానున్న ఊహలు గుసగుసలాడే సీరియల్ కూడా హిందీలో సక్సెస్ అనుకున్న పునర్వివాహ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.