ఈ హీరోని గుర్తు పట్టారా… ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
Happy days rahul :శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా లో నటించిన ఈ కుర్రాడిని ఒక్కసారి పరిశీలనగా చూడండి చూశారుగా. ఎవరో గుర్తు పట్టారా..లేదా..అయితే చూడండి. హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ అంటూ ఒక బక్కపలచని అబ్బాయి ఉంటాడు కదా అతనే ఈ కండలవీరుడు.ఇతని అసలు పేరు రాహుల్ అయినా టైసన్ గా మంచి పేరు వచ్చింది.
హ్యాపీ డేస్ సినిమా హిట్ అయినా ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినా ఆ సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. రెయిన్ బో, వెంకటాపురం వంటి సినిమాలు చేసిన గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఇంట్లో ఉండి బాడీ బిల్డప్ చేసి ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం.