బయోపిక్స్ లో ఛాన్స్ వదిలేసిన స్టార్స్ ఎంత మంది ఉన్నారో…!?
Rejected to act in biopics :లెజెండరీ ల బయోపిక్స్ తీస్తున్నారు. మహనటి తరవాత బయోపిక్స్ బాగా ఊపందుకున్నాయి. అయితే కొందరికి ఛాన్స్ లు వచ్చినా ఆ సినిమాల్లో నటించలేక పోయారు. కొందరు వివిధ కారణాలతో నటించలేకపోయారు. మహానటి మూవీలో సావిత్రి క్యారెక్టర్ కోసం ముందుగా నిత్యామీనన్ ను అడిగారట. కానీ పలు కారణాలతో ఆమె ఓకే చెప్పకపోవడంతో కీర్తి సురేష్ సెలెక్ట్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో జెమిని గణేష్ క్యారెక్టర్ కోసం సూర్యను అదిగితే, కుదరకపోవడంతో దుల్కర్ సల్మాన్ కు ఛాన్స్ వచ్చింది.
బాగ్ మిల్కా బాగ్ సినిమాలో మిల్కా సింగ్ క్యారెక్టర్ కోసం ముందుగా అక్షయ్ కుమార్ కు ఛాన్స్ వచ్చింది. అయితే డేట్లు ఎడ్జెస్ట్ కాకపోవడంతో వదిలేసుకున్నాడు. సంజయ్ దత్ బయోపిక్ సంజు సినిమాలో ముందుగా సంజయ్ క్యారెక్టర్ చేసేందుకు రణ్ వీర్ సింగ్ ను సంప్రదిస్తే, నో చెప్పడంతో రణ్ బీర్ కపూర్ ని ఒకే చేసారు. సునీల్ దత్ బయోపిక్ సంజులో నటించేందుక అక్షయ్ ఖన్నాను అడిగినా, ఎందుకో ఒప్పుకోలేదు. దంగల్ మూవీలో పొగట్ సిస్టర్స్ క్యారెక్టర్ కోసం తాప్సీ, అక్షర హాసన్, దీక్ష సేత్ ను సంప్రదించినప్పటికీ అమిర్ సలహాతో వారిని మార్చారు.
పద్మావత్ మూవీలో రతన్ సింగ్ క్యారెక్టర్ కోసం ముందుగా షారుఖ్ ఖాన్ ను అడిగితె, నో చెప్పాడు. ఆ తర్వాత ప్రభాస్ ను సంప్రదిస్తే,కూడా పలు కారణాలతో రిజెక్ట్ చేశాడు. లెజెంటరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, బయోపిక్ లో నటించాల్సిందిగా విజయ్ సేతు పతికి ఆఫర్ వచ్చింది. కానీ శ్రీలంక- ఎల్ టి టి ఈ మధ్య జరిగిన వివాదంలో ముత్తయ్య ఎల్ టి టి ఈకి వ్యతిరేకంగా మాట్లాడాడు. అందుకే నెటిజన్లు ఈ విషయంగుర్తు చేస్తూ విజయ్ సేతుపతిని టార్గెట్ చేసిన నేపథ్యంలో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.