రాజబాబు ఎన్ని కోట్ల ఆస్థిని సంపాదించాడో తెలుసా?
Comedian Raja Babu assets : తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి బాగా గుర్తుండిపోయే కామెడీ నటుడు రాజబాబు ఈయన చాలా చిన్న వయసులో మరణించిన అభిమానుల గుండెల్లో మాత్రం చెరగని ముద్ర వేశారు. రాజబాబు చనిపోయే సమయానికి ఆయన దగ్గర ఆస్తులు ఏమీ లేవు అని చాలా మంది అంటుంటారు. అది నిజం కాదు రాజబాబు దగ్గర అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల విలువ దాదాపుగా వందల కోట్లు ఉంటాయని సమాచారం.
రాజబాబు 1937 అక్టోబర్ 20న జన్మించారు. మొదట్లో నాటకాలు వేసి ఆతర్వాత 1960లో సమాజం సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సినిమాల్లో నటిస్తూ చాలా బిజీ అయిపోయారు. ఎంత బిజీ అయ్యారు అంటే రాజబాబు డేట్స్ తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి వాళ్ళ డేట్ తీసుకునేవారు అప్పట్లో రాజబాబు కు అంత క్రేజ్ ఉండేది హీరోలతో సమానంగా పారితోషకం తీసుకొనేవాడు. రాజబాబు 1983 సంవత్సరం ఫిబ్రవరి 14న 45 ఏళ్ల వయసులో మరణించారు. రాజబాబుకి నాగేంద్రబాబు మహేష్ బాబు ఇద్దరు కొడుకులు ఉన్నారు వీరిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు
రాజబాబు తమ్ముడు చిట్టి బాబు ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజబాబు ఆస్తుల గురించి చెప్పారు. రాజబాబు దురదృష్టవంతుడు అని.. అప్పట్లో అంత సంపాదించి కూడా అనుభవించకుండా వెళ్లిపోయాడని బాధ పడ్డాడు. 1970ల్లోనే ఈయన ఫారెన్ కార్లలో తిరిగే వాడని.. ఆ రోజుల్లోనే శివాజీ గణేషన్ నుంచి లక్ష రూపాయలు పెట్టి ఫారెన్ కారు కొన్నాడని,వాళ్లకు ఇండియాతో పాటు అమెరికాలోనూ ఆస్తులున్నాయని.. అక్కడ వాళ్ల సొంత సాఫ్‌వేర్ కంపెనీ పెట్టుకుని పిల్లలిద్దరూ హాయిగా ఉన్నారని చెప్పారు. కేవలం కంపెనీ విలువే 30 కోట్ల వరకు ఉంటుందని.. వాటితో పాటు మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు చిట్టి బాబు.