MoviesTollywood news in telugu

బాలకృష్ణ కెరీర్ లో టాప్ 10 హిట్ సినిమాలు ఏమిటో చూద్దాం

Balakrishna Top 10 Hit Movies :NTR నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి మాస్ హీరోగా నిల్చిన నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 100డేస్ ఆడిన సినిమాలెన్నో ఉన్నాయి. మరికొన్ని రికార్డులను తిరగరాసాయి. హీరోగా కెరీర్ ని మలుపు తిప్పిన మూవీ మంగమ్మగారి మనవడు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీ 7సెంటర్స్ లో 100డేస్ ప్రదర్శితమై,ఇండస్ట్రీ హిట్ కి దగ్గరలో ఆగింది. బాలయ్య స్టార్ పవర్ ని నిలబెట్టిన సినిమా ముద్దుల కృష్ణయ్య. మొదటి వారం కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన మూవీ ఇది. ఇండస్ట్రీ మొత్తం ఈ మూవీ గురించి చర్చించుకున్నారు. 2కేంద్రాల్లోనే వంద ఆడింది.

ముద్దుల మావయ్య మూవీ బాలయ్యకు తొలి ఇండస్ట్రీ హిట్. 28సెంటర్స్ లో వందరోజులు , 5న్నర కోట్ల షేర్ వసూలు చేసిన మూవీ. ఇక బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన లారీ డ్రైవర్ మూవీ బాలయ్యకు మాస్ ఇమేజ్ తెచ్చింది. 10 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. రౌడీ ఇన్స్పెక్టర్ 25కేంద్రాల్లో 100డేస్, 9కోట్ల షేర్ తో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఇక బాహుబలి వచ్చేదాకా జానపద చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ భైరవద్వీపం. 28సెంటర్స్ లో 100డేస్, 9కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అయితే కొద్దిలో ఇండస్ట్రీ హిట్ మిస్సయింది.

బాలయ్య కెరీర్ లో మొదటిసారి 10కోట్ల షేర్ తెచ్చిన మూవీ పెద్దన్నయ్య. 34సెంటర్స్ లో వందరోజులు ఆడడంతో సరైన సమయంలో బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇక సమరసింహారెడ్డి గురించి చెబితే ట్రెండ్ సెట్టర్. 20కోట్ల గ్రాస్, 15కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మూవీ ఇది. 73సెంటర్స్ లో 100డేస్ తో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. సమరసింహారెడ్డి తర్వాత మరో బాక్సాఫీస్ హిట్ నరసింహనాయుడు. 30కోట్ల గ్రాస్, 20కోట్ల షేర్ కలెక్ట్ చేసిన తెలుగు తొలిచిత్రంగా నిల్చింది. ఇండస్ట్రీ హిట్ అయింది. తనలో ఏమాత్రం స్టామినా తగ్గలేదని నిరూపించిన సినిమా సింహా. 30కోట్ల షేర్ కొట్టిన బాలయ్య కెరీర్ లో మైలురాయి ఈ మూవీ.