జానకి కలగనలేదు సీరియల్ లో రాశి క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిన హీరోయిన్
janaki kalaganaledu serial :స్టార్ మాలో ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ కొద్దిరోజుల క్రితం నుంచి ప్రసారం అవుతున్నా సరే, మంచి క్రేజ్ తెచ్చుకుంది. హీరోకి తల్లిగా జ్ఞానంబి పాత్రలో ఒకనాటి అందాల తార రాశి నటిస్తోంది. చైల్డ్ ఆరిస్టుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి,ఎన్నో సినిమాల్లో చేసింది. పెద్దయ్యాక హిందీ మూవీస్ లో నటించి తర్వాత తెలుగులోకి వచ్చింది. తెలుగులో వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా రాశి దూసుకెళ్లింది. తమిళం, మలయాళం,హిందీ సినిమాల్లో నటించిన ఈమెకు శుభాకాంక్షలు,గోకులంలో సీత,ప్రేయసి రావే వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి.
మనసిచ్చిచూడు,పెళ్లిపందిరి,దేవుళ్ళు,మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది ఇలా 80 సినిమాల్లో రాశి నటించింది. నిజం సినిమాలో వాంప్ క్యారెక్టర్ కూడా చేసింది. గిరిజా కళ్యాణం తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన రాశి ప్రస్తుతం జానకి కలగనలేదు మూవీలో జ్ఞానంబిగా చేస్తోంది. అయితే ముగ్గురు హీరోయిన్స్ ని ఈ పాత్రకోసం రిజెక్ట్ చేశారట. నెంబర్ వన్ కోడలు సీరియల్ లో వాగ్దేవిగా నటిస్తున్న సుధా చంద్రన్ మయూరి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచి డాన్సర్.
ఒక కాలు లేకున్నా,కష్టపడి చాలా మూవీస్,డాన్స్ ప్రోగ్రామ్స్ చేసింది. తొలిసారి నెంబర్ వన్ కోడలులో నటిస్తోంది. త్రినయని లో విలన్ తిలోత్తమగా మంచి గుర్తింపు పొందిన పవిత్ర జయరాం మొదట్లో కన్నడ సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది. నిన్నే పెళ్లాడట సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాధమ్మ కూతురు సీరియల్ లో హీరో తల్లి బుజ్జమ్మగా సౌమ్యలత నటిస్తోంది. మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ ముగ్గురు రాశి నటిస్తున్న పాత్రను రిజెక్ట్ చేశారు.