కరోనా సమయంలో ఫ్రిజ్ లో వాటర్ తాగుతున్నారా…రిస్క్ లో పడినట్టే
fridge water Side Effects in telugu :ఎండాకాలం వచ్చేసింది. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎండలో బయటకు వెళ్లి వచ్చామంటే చల్లని నీటిని త్రాగాలని అనిపిస్తుంది. దాంతో ఫ్రిజ్ లో వాటర్ త్రాగుతూ ఉంటాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటిలో ఫ్రిజ్ ఉండటం వలన ఫ్రిజ్ లో చల్లని నీటిని త్రాగేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఇలా ప్రతి రోజు ఫ్రిజ్ లోని చల్లని నీటిని త్రాగటం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో ఫ్రిజ్ లో వాటర్ తాగితే దగ్గు,రొంప,గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రిజ్ లో వాటర్ కి దూరంగా ఉంటేనే మంచిది. అలాగే ఫ్రిజ్ లో వాటర్ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం.
ఫ్రిజ్లోని చల్లని నీటిని త్రాగటం వలన రక్త నాళాలు సంకోచించి జీర్ణక్రియ మందగించి జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం జీర్ణం అవ్వటానికి కొన్ని ఎంజైమ్స్,ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి.చల్లని నీటిని త్రాగటం వలన ఎంజైమ్స్,ఆమ్లాల ఉత్పత్తికి ఆటంకం కలిగి జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు వస్తాయి. ఫ్రిజ్ వాటర్ త్రాగితే హాయిగా ఉన్నాశరీరాన్ని డి హైడ్రేడ్ చేస్తుంది.
అలాగే గొంతు నొప్పి వంటివి వస్తాయి. అంతేకాకుండా హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. ఏదైనా పని చేసిన తర్వాత కాస్త అలసటగా ఉన్నప్పుడు ఫ్రిజ్ లోని నీటిని త్రాగటం వలన శరీరంలో వేడి పెరుగుతుంది. ఫ్రిజ్ లోని చల్లని నీరు త్రాగటం వల్ల శరీరంలో శక్తి అంతా ఆహారం జీర్ణం కావటానికి మరియు పోషకాలను గ్రహించటానికి కాకుండా శరీరంలో ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించటానికి సరిపోతుంది. దాంతో జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో మార్పులు వస్తాయి.
అది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. చల్లని నీటిని త్రాగటం వలన తీసుకున్న ఆహారంలో కొవ్వులను జీర్ణం చేయటం కష్టం అవుతుంది. చాలా మంది కేలరీలు బర్న్ అవుతాయని చల్లని నీటిని త్రాగుతూ ఉంటారు. అయితే అది చాలా తప్పు. ఎందుకంటే జీర్ణవ్యవస్థ మీద ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి కేలరీలను బర్న్ చేసుకోవటానికి ఈ మార్గం కాకుండా వేరే మార్గాలను అన్వేషణ చేయాలి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని త్రాగితే జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. అదే ఫ్రిజ్ లోని నీటిని త్రాగితే జీర్ణ ప్రక్రియ సరిగా సాగక మలబద్దకం సమస్య వస్తుంది.