తెలుగు నేర్చుకొని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న టాప్ హీరోయిన్స్ వీరే
Tollywood Heroines :నటీనటులకు హావభావాలు,వాచకం చాలా ముఖ్యం. అయితే కొంతమంది ఇతర భాషల నటీనటులను పెట్టుకోవడం వలన డబ్బింగ్ చెప్పిస్తున్నారు. అయితే తెలుగులో నటించిన ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోయిన్స్ తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పుకున్నారు. వాళ్ళల్లో ప్రధానంగా చూస్తే, లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతున్న నయనతార తెలుగులో చాలా మూవీస్ చేసింది. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన కృష్ణం వందే జగద్గురుమ్ మూవీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.
మిల్కి బ్యూటీ తమన్నా ఊపిరి,ఎఫ్ 2మూవీస్ లో తన పాత్రకు తానె డబ్బింగ్ చెప్పుకుంది. అలా మొదలైంది మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ తన రెండో సినిమా ఇష్క్ తో డబ్బింగ్ సొంతంగా చెప్పుకుంది. అంతేకాదు, గుండె జారి గల్లంతయింది మూవీలో తాను డబ్బింగ్ చెప్పుకోవడమే కాదు, మరో నటికి డబ్బింగ్ చెప్పి, సింగర్ గా కూడా టాలెంట్ చాటుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన నాన్నకు ప్రేమతో మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. అయితే ఆతర్వాత సినిమాల్లో డబ్బింగ్ చెప్పుకోకపోవడం విశేషం.
పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీలో చేసిన కీర్తి సురేష్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి,తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన సాయిపల్లవి తన మొదటి సినిమాకు తానే స్వయంగా పైగా తెలంగాణా యాసలో డబ్బింగ్ చెప్పుకుంది. నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ‘అ ఆ’ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ తనపాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఇది ఆమెకు రెండవ సినిమా. రష్మిక మందన్నా కూడా సరిలేరు నీకెవ్వరూ మూవీలో తనపాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.