టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో…!?
Koti son Rajeev :తెలుగు ఇండస్ట్రీలో మెలోడీ సాంగ్స్ కి పెట్టింది పేరు సాలూరు రాజేశ్వరరావు. ఎన్నో హిట్ మూవీస్ కి చక్కని బాణీలు అందించిన రాజేశ్వరరావు తనయుడే కోటి. టివిరాజు తనయుడు రాజ్ తో కలిసి రాజ్ – కోటి ద్వయం ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ ఇలా అగ్ర హీరోల సినిమాలకు సంగీతం అందించారు.
యముడికి మొగుడు, నువ్వే కావాలి ఇలా ఎన్నో హిట్ మూవీస్ వీరి ఖాతాలో ఉన్నాయి. తర్వాత రాజ్ కోటి విడిపోయారు. ఇండస్ట్రీలో ఎందరో నటవారసులు వస్తున్నట్లుగానే కోటి కూడా తన తనయుడు రాజీవ్ ని హీరోగా ఎంట్రీ ఇప్పించాడు. ప్రముఖ దర్శకుడు చందు తెరకెక్కించిన నోట్ బుక్ మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ నిలదొక్కుకోలేక పోయాడు.
2007లో వచ్చిన ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో కన్పించిన రాజీవ్ నిజానికి మంచి సింగర్ కూడా. అందుకే ఇప్పుడు సింగర్ గా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. అయితే కోటి తలచుకుంటే వరుస సినిమాలు నిర్మించి కొడుకుని నిలబెట్టవచ్చు. ఎందుకో అలా చేయలేదు. అందుకే మూడు తరాలుగా వస్తున్న మ్యూజిక్ ని నమ్ముకుని సింగర్ గా రాబోతున్నాడు రాజీవ్.