సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే
sai pallavi rejects Movies :ఫిదా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి, రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిన సాయిపల్లవి, గ్లామర్ కన్నా నటనకు ప్రాధాన్యం గల పాత్రలను ఎంచుకుంటూ సత్తా చాటుతోంది. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ పట్ల ఆసక్తి చూపకపోవడం వలన కొన్ని సినిమాలను వదిలేసుకుంది. వాటి వివరాల్లోకి వెళ్తే, అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సరిలేరు నీకెవ్వరూ మూవీలో మొదట్లో సాయిపల్లవిని అనుకున్నారట. డైరెక్టర్ కూడా సంప్రదించగా, తనకు పెద్దగా ప్రాధ్యాన్యం లేని పాత్ర అని రిజెక్ట్ చేయడంతో సూపర్ స్టార్ మహేష్ సరసన రష్మిక మందన్న ను సెలక్ట్ చేశారు.
డియర్ కామ్రేడ్ మూవీలో విజయ దేవరకొండ సరసన సాయిపల్లవిని హీరోయిన్ గా సెలక్ట్ చేశారట. పాత్ర నచ్చకపోవడంతో ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందట. ఇక తెలుగులో హిట్ అయిన ఛత్రపతి మూవీని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సాయిపల్లవిని హీరోయిన్ గా అడిగితె నో చెప్పేసింది. మలయాళం మూవీ రిమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సాయిపల్లవిని సెలెక్ట్ చేయాలనీ భావిస్తే మూడు కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. దీంతో నిత్యామీనన్ ని సెలక్ట్ చేసారు.
అంతేకాదు,మరికొన్ని కమర్షియల్ మూవీస్ ,యాడ్స్ కి కూడా సాయిపల్లవి నో చెప్పిందని టాక్. ప్రస్తుతం నాగచైతన్యతో లవ్ స్టోరీ, రానాతో విరాటపర్వం మూవీస్ చేస్తోంది. మూవీ స్టోరీ బాగుండడంతో పాటు తానూ చేసే పాత్రకు ప్రాధ్యాన్యం ఉండాలని ఎన్నో సార్లు సాయిపల్లవి చెప్పుకొచ్చింది.